భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ట్రైనీ/ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు | BEL Ltd Recruitment 2025 | Udyoga Varadhi
Admin
BEL Ltd Recruitment 2025!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్న ఒక భారతీయ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (PSU). ఇది ఒక నవరత్న కంపెనీ. BEL యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు. ఇది భారత ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మరియు రక్షణ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది ప్రధానంగా గ్రౌండ్ మరియు ఏరోస్పేస్ అప్లికేషన్ల కోసం అధునాతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారుచేస్తుంది.
BEL నుండి ట్రైనీ ఇంజనీర్ -l మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-l తాత్కాలిక ఒప్పంద పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ విధానం మరియు ముఖ్యమైన తేదీలను కింద తెలిపిన వివరాల్లో చూడవచ్చును.
ఈ సంస్థ నుండి ట్రైనీ ఇంజనీర్స్– 67, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ –70 ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.
విద్యార్హతలు:
1) ట్రైనీ ఇంజనీర్ -l: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E/B.Tech/B.Sc Engineering లో Electronics/Mechanical/Computer Science Engineering కోర్స్ పాసై ఉండాలి. 2) ప్రాజెక్ట్ ఇంజనీర్ -l: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E/B.Tech/B.Sc Engineering లో Electronics/Mechanical/Computer Science Engineering కోర్స్ పాసై ఉండాలి.
1) ట్రైనీ ఇంజనీర్ -l: 28 Years OBC – 3 Years SC/ST – 5 Years PwBD – 10 Years Relaxation 2) ప్రాజెక్ట్ ఇంజనీర్-l: 32 Years OBC – 3 Years SC/ST – 5 Years PwBD – 10 Years Relaxation
జీతం:
A) ట్రైనీ ఇంజనీర్ -l: 1st Year – ₹. 30,000/- 2nd Year – ₹. 35,000/- 3rd Year – ₹. 40,000/-
B) ప్రాజెక్ట్ ఇంజనీర్ -l: 1st Year – ₹. 40,000/- 2nd Year – ₹. 45,000/- 3rd Year – ₹. 50,000/- 4th Year – ₹. 55,000/-
ఎంపిక విధానం: వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ.
1) ట్రైనీ ఇంజనీర్ -l: * వ్రాత పరీక్ష 100 మార్కులకు కలదు. * ప్రతి తప్పు సమాధానంకు 1/4 వ వంతు నెగిటివ్ మార్కులు కలవు. * ఇంటర్వ్యూ లేదు. 2) ప్రాజెక్ట్ ఇంజనీర్ -l: * వ్రాత పరీక్ష 85 మార్కులకు కలదు. * వ్రాత పరీక్షలో 1:5 నిష్పత్తిలో మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూ దశకు అర్హత లభిస్తుంది. * ఇంటర్వ్యూ 15 మార్కులకు నిర్వహించబడును.
* BEL వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, అభ్యర్థి పూర్తి వివరాలతో అప్లికేషన్ పూర్తి చేసి, పాస్ ఫోటో అతికించాలి. * అప్లికేషన్ ఫారం తో పాటుగా SSC, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, ఇండస్ట్రియల్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ మరియు ఎస్బిఐ బ్యాంక్ రిసిప్ట్ జత చేయవలెను. * పైన తెలిపిన అన్ని ధ్రువీకరణ పత్రములు కింద ఇచ్చిన అడ్రస్ కు 20-02-2025 తేదీలోగా పంపించవలెను. దరఖాస్తు పంపించవలసిన అడ్రస్: Deputy General Manager (HR), Product development and innovation centre (PDIC), Bharat electronics limited, Prof. U R Rao Road, Near Nagaland Circle, Jalahalli Post, Bengaluru – 560 013