CISF లో కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాలు | CISF Jobs Recruitment 2025 | Udyoga Varadhi
Udyoga Varadhi
CISF Jobs Recruitment 2025!
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) అనేది భారతదేశంలో హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే కేంద్ర సాయుధ పోలీసు దళం. CISF యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రభుత్వ లేదా ప్రైవేట్ యాజమాన్యంలోని పెద్ద సంస్థలకు భద్రత కల్పించడం. ఈ సంస్థ నుండి కానిస్టేబుల్ / డ్రైవర్స్ మరియు కానిస్టేబుల్ /పంప్ ఆపరేటర్ ఉద్యోగాలకి భర్తీకి CISF Jobs Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, ముఖ్య తేదీలు, అప్లై చేసే విధానం ఇతర ముఖ్యమైన వివరాల కోసం కింద చూసుకోగలరు.
పోస్టుల వివరాలు :
ఈ సంస్థ నుండి కానిస్టేబుల్ / డ్రైవర్స్ – 845,కానిస్టేబుల్ /పంప్ ఆపరేటర్ – 279 ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.
విద్యార్హతలు :
కానిస్టేబుల్ / డ్రైవర్స్ మరియు కానిస్టేబుల్ /పంప్ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకునే వారు SSC తో పాటు ఈ క్రింద ఇవ్వబడిన డ్రైవింగ్ లైసెన్సులను కలిగి ఉండాలి.
Heavy Motor Vehicle/ Transport Vehicle
Light Motor Vehicle
Motor Cycle with gear.
జీతం :
కానిస్టేబుల్ / డ్రైవర్స్ మరియు కానిస్టేబుల్ /పంప్ ఆపరేటర్ పోస్టులకి జీతం Rs. 21,700/- to Rs. 69,100/-
వయస్సు:
కానిస్టేబుల్ / డ్రైవర్స్ మరియు కానిస్టేబుల్ /పంప్ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేయాలనుకునే వారి వయస్సు 21 నుంచి 27 మధ్యలో ఉండాలి.