GPO Notification 2025:
ప్రస్తుతం తెలంగాణలో గ్రామ పాలన అధికారుల నియామకాలు అనేది చర్చనీయాంశం గా మారింది. అసలు ఈ గ్రామ పాలన అధికారి పోస్టును తెలంగాణలో కొత్తగా ఎందుకు సృష్టించడం జరిగింది? ఇంతకు ముందు ప్రతీ గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ అధికారి ఉండి గ్రామ స్థాయిలో పాలన వ్యవహారాలను చూసుకునేవారు, అయితే గతంలో ప్రభుత్వం ఈ VRO వ్యవస్థను పూర్తి స్థాయి లో రద్దు చేసి విలేజ్ రెవెన్యూ అధికారులను మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ లను ఇతర డిపార్ట్మెంట్ లలో సర్దుబాటు చేయడం జరిగింది.
అప్పటి నుంచి గ్రామ స్థాయిలో పాలన వ్యవహారాలు నెమ్మదించడం, భూ సమస్యల పరిష్కారాలలో జాప్యం జరగడం, సంక్షేమ పథకాలు ప్రజల వరకు తీసుకు వెళ్లలేకపోవడం, ఇలాంటి సమస్యలు ప్రభుత్వానికి ఎదురవ్వడము జరిగింది.
Join Our Telegram Channel For More Job Updates
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం, 2025 ను తీసుకురావడం జరిగింది. ఈ భూ భారతి చట్టం అమలులో భాగంగా సమస్యల పరిశీలనకై సిబ్బంది నియామకం అవసరం ఏర్పడడం జరిగింది.
ఈ అన్నీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 10,956 గ్రామ పాలన అధికారుల అవసరం ఉంటుందని ఈ పోస్టులను నోటిఫై చేయడం జరిగింది.
అయితే, ఈ సిబ్బంది కొరతను ధృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం గతంలో విలేజ్ రెవెన్యూ అధికారులుగా పనిచేసిన వారినే ఈ గ్రామ పాలన అధికారులుగా నియమించుకుంటే వారి అనుభవాన్ని ఉపయోగించుకుని సమస్యలను సత్వరంగా పరిష్కరించ వచ్చని ఊహించారు.
దీనికై ప్రభుత్వం గత విలేజ్ రెవెన్యూ అధికారులు మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ల నుంచి ఈ గ్రామ పాలన అధికారి పోస్టులో జాయినింగ్ కోసం వారి నుంచి Willing ను కోరడం జరిగింది.
అయితే, గత విలేజ్ రెవెన్యూ అధికారులు మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ లు ఈ గ్రామ పాలన అధికారులుగా జాయిన్ అయితే ఆ తర్వాత ప్రమోషన్ లపై క్లారిటీ ఇవ్వక పోవడం, మరియు ఇప్పుడున్న సీనియార్టీ కొల్పవడం లాంటి కారణాల వల్ల వారు ఈ గ్రామ పాలన అధికారులుగా జాయిన్ అయ్యేందుకు సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం.
So, ఈ గ్రామ పాలన అధికారుల ఆవశ్యకత వల్ల ప్రభుత్వం అన్నీ పోస్టులను Direct Recruitment ద్వారానే నియమించేందుకు సిద్దమైందని తెలుస్తుంది.
కాబట్టి, మరి కొద్ది రోజుల్లోనే ఈ 10,956 గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, దీంతో నిరుద్యోగులకు ఉద్యోగం సాదించే అవకాశం మెరుగ్గా ఉంది.
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే ఈ పోస్టు కు సంబందించి అన్నీ విషయాలు తెలుసుకొని ప్రిపేర్ అయితే జాబ్ సాదించే అవకాశం చాలానే ఉంది. మనం ఈ పోస్టు గురించి తెలుసుకుందాం.
ఈ గ్రామ పాలన అధికారి పోస్ట్ అనేది కొత్త కాబట్టి గత నోటిఫికేషన్ లు ఏమి లేక పోవడం దాని సిలబస్ ఏంటి అనేది ఎవరికి ఇప్పటి వరకు అవగాహన లేదు, గత విలేజ్ రెవెన్యూ అధికారి పోస్టు లాంటిదే ఈ గ్రామ పాలన అధికారి పోస్ట్ కాబట్టి దీనికి కూడా విలేజ్ రెవెన్యూ అధికారికి ఉన్నటు వంటి విద్యార్హతలు, వయస్సు, సిలబస్, పరీక్ష విధానం ఆ విదంగానే ఉంటుందని ఒక అవగాహన.
గత విలేజ్ రెవెన్యూ అధికారి, పంచాయత్ సెక్రటరీ పోస్టుకు ఉన్నటువంటి విద్యార్హతలు ఇతర విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.
గత విలేజ్ రెవెన్యూ అధికారి & పంచాయత్ సెక్రటరీ సిలబస్ :