GPO నియామకాలకై మార్గదర్శకాల జారీ |GPO Appointment Guidelines 2025| Udyoga Varadhi

GPO Appointment Guidelines 2025!

           తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 10,956 గ్రామ పరిపాలన అధికారుల పోస్టులను నోటిఫై చేయడం జరిగింది.
         నియామకాలకు సంబందించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది.
GPO Appointment Guidelines 2025- ఇవి కేవలం VRO/VRA ల నుంచి  గ్రామా పాలన ఆఫీసర్ గా నియమించేవారి కోసమే, GPO 10,956 పోస్టుల్లో వీరు నియమింపబడిన తరువాత మిగతా పోస్ట్ లను Direct Recruitment ద్వారా నియమించడం జరుగుతుంది. దానికి సంబందించిన Notification ని తెలంగాణా ప్రభుత్వం అతి త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
Direct Recruitment ద్వారా నియమింపబడే పోస్టులకు దాదాపుగా ఇంతకు ముందు VRO లకు ఉన్న సిలబస్ ప్రకారమే Examination ఉంటుంది. దానికి సంబందించిన వివరాలకై కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను చూడవచ్చు.

10,956 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్

          దీని కోసం తెలంగాణ ప్రభుత్వం G.O.Rt No. 129, Dated: 29.03.2025 జారీ చేసింది. 
         గ్రామ స్థాయి లో పరిపాలనను బలపరచడం కోసం Ex. VRO/VRA నుండి Willing కోరుతూ వారినే గ్రామ పాలన ఆఫీసర్ గా నియమించడానికి G.O.Ms.No.41, Finance (HRM-I) Dept, dated: 22.03.2025 ఉత్తర్వులను జారీ చేసింది.
      దీనికి గాను చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ పోస్ట్ ఆవశ్యకతను తెలుపుతూ Lr.No.Ser.V(1)/3048466/2025, dated: 26.03.2025 ద్వారా నివేదించడం జరిగింది. 
      ఈ అన్నింటి పరిశీలన తరువాత తెలంగాణ ప్రభుత్వం Ex. VRO/VRA నుండి Willing కోరుతూ వారినే గ్రామ పాలన ఆఫీసర్ గా నియమించడానికి చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ ,తెలంగాణ వారికి ఈ నియమకాలకై తదుపరి కార్యాచరణ కోసం అనుమతి ఇవ్వడం జరిగింది.

రాజీవ్ యువ వికాసం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి

నియామక పద్దతి / Method of Appointment :

గతం లో గల VRO లను, వేరే ఇతర డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా సర్దుబాటు చేసిన Ex.Village Revenue Officers and Village Revenue Assistants లను ఈ పోస్టు కు సంబందించి విద్యార్హత ఉంటే వారినే గ్రామ పాలన ఆఫీసర్(GPO) గా నియమించడం జరుగుతుంది.

Eligibility Criteria :

గ్రామ పాలన ఆఫీసర్ గా నియమించబడడానికి ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి.

                                    Or

ఇంటర్మీడియట్ తో పాటు మినిమమ్ 5 సంllరాలు VRO గా సర్విస్ చేసి ఉండాలి or VRA నుంచి రికార్డు అసిస్టెంట్ / జూనియర్ అసిస్టెంట్ గా సర్విస్ అయిన చేసి ఉండాలి.

Join Our Telegram Channel For More Job Updates

ఉద్యోగ బాధ్యత / Job Responsibility :

  • గ్రామానికి సంబందించిన అక్కౌంట్స్ ను మెయింటెనెన్స్ చేయాలి.
  • వివిధ ధృవపత్రాల జారీ కోసం విచారణలు నిర్వహించడం.
  • ప్రభుత్వ భూములు, సరస్సులు మరియు నీటి వనరులపై ఆక్రమణలకు సంబంధించి విచారణలు నిర్వహించడం మరియు వాటి రక్షణను నిర్ధారించడం.
  • భూమి సంబంధిత వివాదాలను దర్యాప్తు చేయడం మరియు భూమి సర్వేలో సర్వేయర్కు సహాయం చేయడం.
  • విపత్తు నిర్వహణకు సంబంధించిన విధులను నిర్వర్తించడం మరియు అవసరమైన/అత్యవసర సేవలను అందించడం.
  • సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులకు లబ్ధిదారులను గుర్తించడం.
  • ఎన్నికల సంబంధిత విధుల్లో సహాయం చేయడం మరియు ప్రోటోకాల్ అధికారులకు మద్దతు ఇవ్వడం.
  • గ్రామ, క్లస్టర్ మరియు మండల స్థాయిలో అంతర్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవడం.
  • ప్రభుత్వం, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా తహశీల్దార్ అప్పగించిన ఏవైనా ఇతర విధులను నిర్వర్తించడం.GPO Appointment Guidlines 2025

స్కిల్ ఇండియా తో ఉపాధి అవకాశాలు

Selection process :

  • GPO పోస్టుకు దరఖాస్తుదారుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అర్హత మరియు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించబడుతుంది.
  • రెవెన్యూ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం మరియు ప్రజా సేవలను అందించడం కోసం పైన పేర్కొన్న బాధ్యతలకు సంబంధించిన జ్ఞానం మరియు నైపుణ్యాలను ఈ పరీక్ష అంచనా వేస్తుంది.

Authority for Selection and Appointment :

  • గ్రామపాలన అధికారి ఎంపిక మరియు నియామకం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లేదా ఈ ప్రయోజనం కోసం CCLA నియమించిన ఏదైనా అధికారి నిర్వహిస్తారు మరియు జిల్లాల కేటాయింపు జరుగుతుంది.
  • గ్రామపాలన అధికారుల నియామకం సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా జరుగుతుంది.

Service Conditions :

  • గ్రామ పాలన అధికారి పోస్ట్ ను  నియంత్రించే సర్విస్ నియమాలను తగిన సమయంలో రూపొందించడం జరుగుతుంది.
  • GPO పోస్ట్లో పే స్కేల్ మరియు జీతం దరఖాస్తుదారు ప్రస్తుత పోస్ట్లో తీసుకుంటున్న దానికి సమానంగా ఉంటాయి.
  • రెవెన్యూ శాఖలో మునుపటి VROలు మరియు VRAలు అందించిన మునుపటి సేవలను సీనియారిటీలో లెక్కించరు.

Official Guidelines

Official Website

1 thought on “GPO నియామకాలకై మార్గదర్శకాల జారీ |GPO Appointment Guidelines 2025| Udyoga Varadhi”

Leave a Comment