BEL లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | BEL Ltd Jobs Recruitment 2025 | Udyoga Varadhi
Udyoga Varadhi
BEL Ltd Jobs Recruitment 2025!
రక్షణ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వం యాజమాన్యంలో గల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (PSU). ఇది ఒక నవరత్న కంపెనీ. BEL యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో కలదు మరియు దేశంలో వివిధ ప్రాంతాలలో కంపెనీకి యూనిట్లు కలవు.
ఇది భారత ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మరియు రక్షణ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది ప్రధానంగా గ్రౌండ్ మరియు ఏరోస్పేస్ అప్లికేషన్ల కోసం అధునాతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.
BEL, పూణే యూనిట్ నుండి డిప్యూటీ ఇంజనీర్ (E-ll) ఎలక్ట్రానిక్స్, డిప్యూటీ ఇంజనీర్ (E-ll) మెకానికల్, డిప్యూటీ ఇంజనీర్ (E-ll) సివిల్ మరియు డిప్యూటీ ఇంజనీర్ (E-ll) ఎలక్ట్రికల్ 5 సంllరాల ఒప్పంద పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషను విధానం మరియు ముఖ్యమైన తేదీలను క్రింద తెలపిన వివరాల్లో చూడవచ్చును.
BEL PUNE నుండి 22 ఉద్యోగాలకై నోటిఫికేషన్లు జారీ చేయడమైనది. అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు.
విద్యార్హతలు:
1) డిప్యూటీ ఇంజనీర్ (E-ll) ఎలక్ట్రానిక్స్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E/B.Tech/AMIE/GIETE కోర్స్ ను GEN/OBC/EWS అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో పాసై మరియు SC/ST/PwBD అభ్యర్థులు పాసై ఉండాలి. * ఈ పోస్టులకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్ మరియు టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు మాత్రమే అర్హత కలదు. 2) డిప్యూటీ ఇంజనీర్ (E-ll) మెకానికల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E/B.Tech/AMIE/GIETE కోర్స్ ను GEN/OBC/EWS అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో పాసై మరియు SC/ST/PwBD అభ్యర్థులు పాసై ఉండాలి. * ఈ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు మాత్రమే అర్హత కలదు. 3) డిప్యూటీ ఇంజనీర్ (E-ll) సివిల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E/B.Tech/AMIE/GIETE కోర్స్ ను GEN/OBC/EWS అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో పాసై మరియు SC/ST/PwBD అభ్యర్థులు పాసై ఉండాలి. * ఈ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు మాత్రమే అర్హత కలదు. 4) డిప్యూటీ ఇంజనీర్ (E-ll) ఎలక్ట్రికల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E/B.Tech/AMIE/GIETE కోర్స్ ను GEN/OBC/EWS అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో పాసై మరియు SC/ST/PwBD అభ్యర్థులు పాసై ఉండాలి. * ఈ పోస్టుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు మాత్రమే అర్హత కలదు.
* అన్ని రకాల పోస్టులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు కలదు. OBC (NCL) – 3 Years SC/ST – 5 Years PwBD – 10 years relaxation కలదు.
జీతం:
* అన్ని రకాల పోస్టులకు బేసిక్ ₹. 40,000-3%-1,40,000 మరియు ఇతర అలవెన్స్లు అనగా డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, PRP, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ ఫెసిలిటీ, కంపెనీ రూల్స్ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కలదు.
ఎంపిక విధానం:వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూకలదు.
* రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో 85 మార్కులు టెక్నికల్ డొమైన్ మరియు జనరల్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు అడుగుతారు. * ఈ వ్రాత పరీక్షలో అర్హత సాధించాలి అంటే GEN/OBC/EWS అభ్యర్థులకు 35% మరియు SC/ST/PwBD అభ్యర్థులకు 30% మార్కులు సాధించాలి. * రాత పరీక్ష లో వచ్చిన మార్కులకు 85% మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులకు 25% వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
BEL వెబ్ సైట్ www.bel-india.in ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసి అప్లై చేయవలెను. ఒక పోస్ట్ కు ఒకేసారి అప్లై చేయవలెను. రెండవసారి అప్లై చేసినచో, చివరగా చేసిన అప్లికేషన్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది.