UPSC IES & ISS ఉద్యోగాల నోటిఫికేషన్ | UPSC IES & ISS Notification 2025 | Udyoga Varadhi

                  UPSC IES & ISS Notification 2025!

                     IAS, IPS లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సమానమైన IES మరియు ISS ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.IES & ISS కు సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ ఉన్నత స్థాయిలలో విధులను నిర్వహిస్తారు. వీరు దేశ మరియు రాష్ట్ర బడ్జెట్, బ్యాంకింగ్, ఉత్పాదన వంటి రంగాలలో విధులు నిర్వహిస్తూ, సర్వే ఆఫ్ ఇండియా వంటి గొప్ప గొప్ప సంస్థలలో ఉద్యోగాలు చేస్తారు.
              IES & ISS వంటి ఉన్నత ఉద్యోగాల భర్తీలో UPSC కఠినమైన పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్ష యొక్క విధివిధానాల పూర్తి సమాచారం కొరకు కింద ఇచ్చిన సమాచారం చదవగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు 2025:

(i) Indian Economic Service(IES) – 12
(ii) Indian statistical service(ISS) – 35 పోస్టులు కలవు.

NTA గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – బయోటెక్నాలజీ అర్హత పరీక్ష 2025

విద్యార్హతలు :

(i) IES : ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనామెట్రిక్స్ లలో పీజీ డిగ్రీ,
(ii) ISS : స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్ లలో పిజి డిగ్రీ ఉండాలి.

జీతం :

1.Indian Economic Service(IES): ₹. 39,100/- నుండి 80,000/-
2.Indian statistical service(ISS): ₹.39,100/- నుండి 80,000/-

వయస్సు:

అభ్యర్థులంతా 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC/ST అభ్యర్థులకు 5 ఐదు సంవత్సరాలు,
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు,
Ex-SM అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు,
PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు కలదు.

ఎంపిక విధానం :

పరీక్ష విధానం: UPSC ఈ IES/ISS పరీక్షను రెండు దశలలో నిర్వహిస్తుంది.
మొదటి దశ: ఈ PART-I దశలో 1000 మార్కులకు, మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి.

రెండవ దశ: ఈ PART – II దశలో పర్సనల్ ఇంటర్వ్యూ 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ లో సాంకేతికత మరియు కఠినమైన ప్రశ్నలు కాకుండా కేవలం అభ్యర్థి యొక్క మానసిక లక్షణాలను మరియు అతని/ఆమె యొక్క గ్రహణ శక్తిని బహిర్గతం చేయడానికి ఉద్దేశించి మరియు అతని/ఆమె రాష్ట్రం లేదా దేశం లోపల మరియు వెలుపల అతని/ఆమె చుట్టూ జరుగుతున్న సంఘటనలతో పాటు ఆధునిక ఆలోచనలపై నాయకత్వ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి బోర్డు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.

పరీక్షా ఫీజు :

* అభ్యర్థులందరికీ ₹. 200/-
* Female/SC/ST/PwBD అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు కలదు.

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేయుటకు ప్రారంభ తేదీ: 12.02.2025
అప్లై చేయుటకు చివరి తేదీ: 04.03.2025
పరీక్ష తేదీ: 20.06.2025 (3 Days)

The examination will be held at the following centres:-

ముఖ్యమైన వెబ్సైట్స్:

Official Website

Online Application link

Official Notification 2025

AIIMS బీబీనగర్ లో 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు 2025

4 thoughts on “UPSC IES & ISS ఉద్యోగాల నోటిఫికేషన్ | UPSC IES & ISS Notification 2025 | Udyoga Varadhi”

Leave a Comment