NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అను సంస్థ, విద్య మంత్రిత్వ శాఖ (MoE), భారత ప్రభుత్వం (GOI) ద్వారా ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశాలకు అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు అంతర్జాతీయ ప్రమాణాల పరీక్షలను నిర్వహించడం కోసం ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి మరియు స్వీయ నిరంతర పరీక్ష సంస్థగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ని ఏర్పాటు చేసింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – బయోటెక్నాలజీ పరీక్షను NTA(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) వారు జాతీయస్థాయిలో నిర్వహించే ఈ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా దేశంలోని ప్రమాద యూనివర్సిటీలల్లో లైఫ్ సెన్సెస్, బయోటెక్నాలజీ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, Ph.D కూర్చున్న ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ప్రతి సంవత్సరం NTA వారు GAT-B అర్హత పరీక్షను నిర్వహిస్తారు. ప్రస్తుతం 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. GAT-B అర్హత పరీక్ష వల్ల ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రవేశం లభించే కోర్సులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది.
జాతీయస్థాయిలో బయోటెక్నాలజీ అనుబంధ లైఫ్ విభాగంలో ఉన్నత విద్య, పరిశోధనల పై చర్యలు చేపడుతున్న విభాగమే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. విద్యార్థులకు ఉన్నత అవకాశాలపై అవగాహన కల్పించేందుకు రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీని నెలకొల్పింది. ఈ సెంటర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్ లలో, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ విభాగాలలో పీజీ లో ప్రవేశాలకు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో JRF(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) అభ్యర్థులను ఎంపిక చేసేందుకు GAT-B అని ప్రత్యేక ఎంట్రెన్స్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు. GAT-B మార్కుల ఆధారంగా DBT, RCB ల గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్ లలో బయోటెక్నాలజీ పీజీ కోర్స్ లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం బయోటెక్నాలజీ తదితర స్పెషలైజేషన్లతో మొత్తం 1,331 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ కు సంబంధించి HCU లో M.Sc బయోటెక్నాలజీ స్పెషలైజేషన్ లో 30 సీట్లు, O.U లో మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్ స్పెషలైజేషన్ లో 10 సీట్లు కలవు. GAT-B మార్కుల ఆధారంగా ఆయా యూనివర్సిటీల నిబంధనల మేరకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ లో లైఫ్ సైన్సెస్, వెటర్నరీ సైన్స్, MBBS, ఫార్మసీ, అగ్రికల్చర్ సబ్జెక్టులలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైఫండ్:
*GAT-B ద్వారా ఆయా యూనివర్సిటీలో పిజి కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులకు, M.Sc బయోటెక్నాలజీ, అనుబంధ విభాగాల విద్యార్థులకు నెలకు ₹. 5,000/- చొప్పున, M.Sc అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ విద్యార్థులకు నెలకు ₹. 7,500/- చొప్పున, M.Tech/MVSC విద్యార్థులకు నెలకు ₹. 12,000/- చొప్పున రెండేళ్ల ఎవరికి ఈ స్టైఫండ్ లభిస్తుంది.
Scheme of Exam:
Section A: Physics, Chemistry, Mathematics & Biology నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 60 మార్కులు ఉంటాయి.
Section B: Basic Biology, Life Sciences, Bio-Technology సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏవైనా 60 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది.
Note: 1) Section – A లో ప్రతి తప్పు సమాధానం కి 0.5 మార్కు, Section – B లో ప్రతి తప్పు సమాధానం కి 1 మార్కు చొప్పున నెగిటివ్ మార్కులు కలవు. 2) Section – A లో ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయి, Section – B లో ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో ఉంటాయి.
GAT – B తోపాటు పేజీ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బయోటెక్నాలజీ సంస్థలు, ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, హెల్త్ కేర్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలలో ప్రొడక్షన్, మానిటరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. Ph.D పూర్తి చేసుకున్న వారికి IICT, CCMB వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్ ల్యాబ్ లలో రీసెర్చ్ అసోసియేట్ హోదాలో ఉద్యోగాలు లభిస్తాయి.
3 thoughts on “NTA గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – బయోటెక్నాలజీ అర్హత పరీక్ష | NTA GAT-B Entrance Exam 2025 | Udyoga Varadhi”