GPO ఫలితాల విడుదల|GPO Results Out 2025| Udyoga Varadhi

GPO Results Out 2025!

GPO Results Out 2025 – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (GPO) పోస్టుల భర్తీకి సంబంధించి 10,954 ఖాళీలను ప్రకటించింది. ఇందుకు గాను గతంలో VRO/VRA గా పనిచేసిన వారినే GPO గా నియమించాలనే ఉద్దేశంతో 25-05-2025 పరీక్షా నిర్వహించడం జరిగింది. 

ఇందుకు గాను 5049 పరీక్షకు హాజరవడం జరింగింది, పరీక్షా ఫలితాలను ఈ రోజు విడుదల చేయడం జరింగింది. పరీక్షకు హాజరు అయిన వారిలో నుంచి 3550 మంది GPO గా సెలెక్ట్ అయ్యారు. 

GPO MERIT LIST.

Official Website

మిగిలిన 7404 GPO పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించడం జరుగుతుంది. ఈ నియామకాల గురించిన వివరాలను కింద చూడవచ్చు.

Join Our Telegram Channel For More Job Updates

GPO డైరెక్ట్ రిక్రూట్మెంట్ :

ఇంతకు ముందు లేని ఈ గ్రామ పరిపాలన అధికారులు అనే కొత్త పోస్టు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ?

గతంలో గ్రామ స్థాయిలో ఒక VRO (Village Revenue Officer) మరియు VRA (Village Revenue Assistant) అనే ఉద్యోగులు ఉండి  గ్రామానికి సంబందించిన భూ రికార్డులను, పన్నులు,  వివిధ ఆధాయలను సేకరించడం మరియు గ్రామానికి సంబందించిన ఇతర వ్యవరహారాలను చూసే వారు. ప్రతి గ్రామానికి ఒక VRO & VRA ఉండే వారు. వీరే గ్రామ స్థాయి పరిపాలనలో, పై అధికారులకు సహాయకారిగా ఉంటూ పాలనలో సౌలభ్యాన్ని అందించేవారు.

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు

Village Revenue Officers/ గ్రామ పరిపాలన అధికారులు నిర్వహించే విధులు :

రికార్డులను నిర్వహించడం : గ్రామంలోని భూములు లేదా ఆస్తులకు సంబందించిన ఖచ్చితమైన రికార్డులను Maintain చేయడం.

ఆధాయ సేకరణ : గ్రామస్తులు చెల్లించాల్సిన పన్నులు (వ్యవసాయ పన్నులు, ఆస్తి పన్నులు) లేదా ఇతర రుసుములను (మార్కెట్ పన్నులు) సకాలంలో సేకరించడం.

నియంత్రణ అమలు : గ్రామస్థులు స్థానిక చట్టాలు లేదా శాసనాలు, జోనల్ చట్టాలు, వ్యవసాయ చట్టాలు మరియు ఆస్తి నిబంధనలతో సహా పాటించేలా చూసుకోవడం.

వివాద పరిష్కారం: భూమి యాజమాన్యం, వారసత్వం లేదా పన్ను సమస్యలకు సంబంధించిన వివాదాలను నిర్వహించడం.

పర్యవేక్షణ : సేకరించిన ఆదాయం సరిగ్గా నమోదు చేయబడినదా? లేదా? మరియు స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోబడుతున్నాయో? లేదో? నిర్ధారించుకోవడం.

ఉన్నత అధికారులతో సమన్వయం : గ్రామం లేదా గ్రామ పరిధి యొక్క ఆర్థిక స్థితిగతుల  గురించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు అందించడం మరియు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పథకాల విధానాలు లేదా నియమ నిబంధనలను అమలు చేయడం.

అయితే గ్రామ స్థాయిలో ఇన్ని రకాల విధులను నిర్వహిస్తూ సులభ పాలనలో తమ సేవలను అందిస్తున్న VRO & VRA ల మొత్తం వ్యవస్థను గతంలో  రద్దు చేసి, వారిని వేరే డిపార్ట్మెంట్ లలో జూనియర్ అసిస్టెంట్ లుగా సర్దుబాటు చేయడం జరిగింది.

దీని వలన గ్రామ స్థాయి పాలనలో అటూ ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది. Field level లో ఆధాయ సమీకరణలలో జాప్యం, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో విఫలమవడం, అసలైన అర్హులను గుర్తించలేకపోవడం, ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడుకోకపోవడం లాంటి ఇబ్బందులను ఎదురుకోవడం జరుగుతుంది.  

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ గ్రామ స్థాయిలో అలాంటి సేవలను తిరిగి పొందే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం “గ్రామ పరిపాలన అధికారులను(GPO)” నియమించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

తమ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం గ్రామ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడం కోసం 10,956 ఉద్యోగులు అవసరమని నిర్దారించడం జరిగింది.

ఇంత భారీ నోటిఫికేషన్ వచ్చే ఆవకాశం ఉన్నందు వల్ల నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కి సంబందించిన syllabus  పై focus చేసి జాబ్ కొట్టే అవకాశాన్ని వదులుకోకూడదు అని మేము కోరుకుంటున్నాము.

Key Factors about this Upcoming GPO Notification!

  • గత పది సంవత్సరాలలో కేవలం 2 సార్లు మాత్రమే notification ఇచ్చి, ఉద్యోగులను నియమించడం జరిగింది.
  • ఉమ్మడి Andhra Pradesh రాష్ట్రం 2013 లో ఒకసారి, Telangana ఏర్పడిన తరువాత 2018 లో ఒకసారి notification రావడం జరిగింది.
  • ఈ 2 notifications లో కూడా కేవలం Intermediate విద్య అర్హతగా ఇవ్వడం జరిగింది.
  • కానీ ఈ సారి Degree అర్హతగా ఇవ్వవచ్చని ఒక అంచనా.
  • Examination లో అడిగే ప్రశ్నల సరళిని ప్రతిసారి కఠినతరం చేయడం జరుగుతుంది.
  • కాబట్టి Previous Examination ని ఆధారం చేసుకొని Cut Off ఎంత ఉండవచ్చని మనం ఒక అవగాహనకు రాలేము.

  • 2014 నుంచి 2025 వరకు నిరుద్యోగుల సంఖ్య కూడా బాగా పెరిగింది అనడంలో కూడా సందేహం లేదు. కాబట్టి Apply చేసుకున్న Applicants మరియు ప్రశ్నల సరళిని బట్టి మాత్రమే Exam జరిగిన తరువాతనే Cut Off Marks పై ఒక అవగాహనకు రావచ్చు.
  • ఈ మధ్య జరిగిన(2018 లో) TSPSC Examinations ను బట్టి చూస్తే VRO EXAM 150 మార్కులకు ఉండడం జరిగింది, ప్రశ్నపత్రాల సరళిని బట్టి అన్నీ కేటగిరి ల వారికి కూడా Cut Off Marks 100 – 120 మధ్యలో ఉండవచ్చు. కొన్ని జిల్లాల్లో ఈ Cut Off Marks అనేవి ఎక్కువగా కూడా ఉండవచ్చు లేదా తక్కువగా కూడా ఉండవచ్చు.

Syllabus:

సిలబస్ పరంగా చూస్తే 2013 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని నోటిఫికేషన్ కి 2018 తెలంగాణ నోటిఫికేషన్ కి మార్పులయితే చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2013 నోటిఫికేషన్లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక 2018 నోటిఫికేషన్ లో VRO కీ ఒకే PAPER తో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సారి కూడా ఒకే పేపర్ ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. ఒకవేళ డిగ్రీ Qualification తో 2 papers కూడా పెట్టవచ్చు దీనికోసం official notification వచ్చే వరకు ఆగవలసిందే.

అయితే 2018 లో జరిగిన VRO Exam కి ఇప్పుడు జరుగబోయే GPO Exam కి ప్రశ్నల సరళిలో చాలా తేడా ఉండవచ్చని భావించవచ్చు. VRO exam అనే కాదు ఇంతకు ముందు జరిగిన పరీక్షలను పరిశీలిస్తే ప్రశ్నల కఠినతరాన్ని పెంచడం మనం గమనించవచ్చు. ఇంతకుముందు simple గా 1 లైన్ questions ఉండేవి కానీ ఇప్పుడు జరిగిన exams ను చూస్తే 1 లైన్ questions కాకుండా statements అండ్ assumptions రూపంలో అడగడం జరుగుతుంది. So మనం ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని next exam కి ఎంత భాగా సన్నద్ధం అయితే జాబ్ సాధించే అవకాశం అంతా పెరగవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో? రాదో? కూడా మనం చెప్పలేము, అందుకే సమయాన్ని వృధా చేయకుండా ఇప్పటినుంచే preparation ను start చేయడం బెట్టర్.

Leave a Comment