భూకంపాలు వాటి ప్రభావాలు | Earthquakes and disaster management | Udyoga Varadhi

Earthquakes and disaster management!

ఈ మధ్య కాలంలో చాల ప్రాంతాల్లో భూకంపాలు సంభవించడం జరుగుతున్నాయి. మొన్న మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాల్లో, నిన్న చైనా,పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్, ఈ రోజు జపాన్ దేశాలలో భూకంపం రావడం జరిగింది. దీని వలన చాల ప్రాంతాలలో ప్రాణ మరియు ఆస్థి నష్టం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ భూకంపాలు అనేక దేశాలలో వచ్చే అవకాశలు చాలా ఉన్నాయి.

Earthquakes and disaster management

అసలు ఈ భూకంపాలు రావడానికి కారణాలు ..?
దీన్ని తీవ్రతను ఎలా కొలుస్తారు..?
ఎలాంటి ప్రదేశాల్లో ఈ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి…?
సహాయక చర్యలు ….?
భూమి అంతర్భాగంలో కొన్ని ప్రదేశాల్లో కొన్ని చర్యల వల్ల అలజడులు ఏర్పడి వాటి నుండి కంపన తరంగాలు ఏర్పడి అవి రాతి పొరల గుండా ప్రయాణించినప్పుడు ఆ రాపిడి వలన భూమి లోపల ఉండే పలకలు (టెక్టోనిక్ ప్లేట్లు) కదలడం వల్ల భూమి అనేది కంపించడం జరుగుతుంది, దీనినే “భూకంపం” అంటారు. ఈ భూకంపాలు సముద్రాల లోపల కూడా రావడం జరుగుతుంది. వీటినే “సునామీ” లు వస్తాయి.
10,956 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్| TG GPO Notification 2025

Join Our Telegram Channel For More Job Updates

భూకంపం రాబోయే ముందు లక్షణాలు :

  • అనుకోని శబ్దాలు – భూమిలోనుండి గంభీరమైన శబ్దాలు వినిపించవచ్చు.
  • జంతువుల అసాధారణ ప్రవర్తన – కుక్కలు మొరిగడం, ఒక్కసారిగా పక్షులు గాలిలో ఎగరడం, జంతువులు భయపడినట్లుగా ప్రవర్తించడం.
  • బావులు లేదా చెరువుల లోని నీరు అలలు వచ్చేలా కదలడం.
ఈ భూకంపాల తీవ్రతను రెక్టార్ స్కేల్ పై కొలుస్తారు.

రిక్టర్ స్కేల్ (Richter Scale) అంటే ఏమిటి?

రిక్టర్ స్కేల్ అనేది భూకంప తీవ్రతను కొలిచే ప్రమాణం. దీనిని 1935లో శాస్త్రవేత్త చార్లెస్ రిక్టర్ అభివృద్ధి చేశారు.
రిక్టర్ స్కేల్ ఎలా పనిచేస్తుంది?
  • భూకంపం వచ్చినప్పుడు భూమి ఎంత తీవ్రంగా కంపించిందో కొలవడానికి ఈ స్కేల్ ఉపయోగిస్తారు.
  • భూకంప తీవ్రతను సైస్మోగ్రాఫ్ (Seismograph) అనే యంత్రం ద్వారా నమోదు చేస్తారు.

సైస్మోగ్రాఫ్ (Seismograph) అంటే ఏమిటి?

సైస్మోగ్రాఫ్ అనేది భూకంపాలను గుర్తించి, వాటి తీవ్రతను నమోదు చేసే ఒక ప్రత్యేకమైన యంత్రం. ఇది భూమి కంపనాలను కొలిచి, వాటి గమనాన్ని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది.

భూకంపాన్ని సైస్మోగ్రాఫ్ ఎలా రికార్డు చేస్తుంది?

  • భూమి కంపించినప్పుడు సైస్మోగ్రాఫ్ లోని సున్నితమైన సూది కదులుతుంది.
  • ఇది సైస్మోగ్రామ్ (Seismogram) అనే గ్రాఫ్‌ను గీయిస్తుంది.
  • చిన్న గీతలు అంటే స్వల్ప భూకంపం, పెద్ద గీతలు అంటే తీవ్ర భూకంపం అని అర్థం.
  • రిక్టర్ స్కేల్ 1 నుంచి 10 వరకు ఉంటుంది.
GPO నియామకాలకై మార్గదర్శకాల జారీ

రిక్టర్ స్కేల్ పై గుర్తించే తీవ్రత మరియు దాని ప్రభావం :

Earthquakes and disaster management

భూకంపాలు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలు – ప్రపంచ వ్యాప్తంగా

భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలు టెక్టోనిక్ ప్లేట్ల సంధుల (Boundaries) వద్ద ఉంటాయి. ఈ ప్రాంతాలను సీస్మిక్ జోన్లు (Seismic Zones) అని కూడా అంటారు.
1. రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) – పసిఫిక్ మహాసముద్రం చుట్టూ
  • ఇది భూకంపాలు & అగ్నిపర్వతాలు ఎక్కువగా జరిగే ప్రదేశం.
  • దేశాలు: జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, చిలీ, మెక్సికో, అమెరికా పశ్చిమ తీరము (కలిఫోర్నియా, అలాస్కా).
  • ప్రపంచంలోని 90% భూకంపాలు ఇక్కడే సంభవిస్తాయి.
2. హిమాలయ పర్వత ప్రాంతం (Himalayan Region)
  • దేశాలు: భారతదేశం (ఉత్తర భాగం – ఉత్తరాఖండ్, అసోం, సిక్కిం), నేపాల్, భూటాన్, పాకిస్తాన్, చైనా, అఫ్ఘానిస్తాన్.
  • టెక్టోనిక్ ప్లేట్లు ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ & యూరేషియన్ ప్లేట్ కొట్టుకునే ప్రదేశం.
  • 2015 నేపాల్ భూకంపం (7.8 మాగ్నిట్యూడ్) ఇక్కడ సంభవించింది.
3. ఇరాన్-టర్కీ-గ్రీస్ భూకంప జోన్
  • మిడిల్ ఈస్ట్ (ఇరాన్, టర్కీ) & యూరోప్ (గ్రీస్, ఇటలీ) లో ఎక్కువగా భూకంపాలు జరుగుతాయి.
  • 2023 టర్కీ భూకంపం (7.8 మాగ్నిట్యూడ్) భారీ నష్టం కలిగించింది.
4. కాలిఫోర్నియా (అమెరికా) – సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ లైన్
  • అమెరికాలో అత్యధిక భూకంప ప్రదేశం.
  • 1906 శాన్ ఫ్రాన్సిస్కో భూకంపం ఇక్కడే వచ్చింది.
5. మెక్సికో & సౌత్ అమెరికా (చిలీ, పెరూ, ఈక్వడార్)
  • 1960లో చిలీలో 9.5 మాగ్నిట్యూడ్ వచ్చిన భూకంపం ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం.

భారతదేశంలో భూకంపాలు : 

భారతదేశంలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి, ముఖ్యంగా టెక్టోనిక్ ప్లేట్ల సంధి ప్రాంతాల్లో. భారతదేశాన్ని భూకంప ముప్పు ఉన్న 4 జోన్లుగా (Seismic Zones) విభజించారు.

భూకంప ప్రభావిత ప్రాంతాలు (Seismic Zones in India)

భారతదేశాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజించారు:
Zone 2 (Low Risk) – తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాలు
Zone 3 (Moderate Risk) – మోస్తరు ప్రమాదం
Zone 4 (High Risk) – ఎక్కువ ప్రమాదం
Zone 5 (Very High Risk) – అత్యధిక ప్రమాదం (హిమాలయ ప్రాంతం, నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్)
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 | Waqf Amendment Bill 2024

భారతదేశంలో ప్రధానమైన భూకంపాలు, ప్రాంతాలు మరియు వాటి ప్రభావాలు :

సహాయక చర్యలు :

NDRF అంటే National Disaster Response Force (జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం). ఇది భారతదేశంలోని ప్రమాదాల సమయంలో సహాయ చర్యలు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బలగం.

Earthquakes and disaster management

NDRF స్థాపన & లక్ష్యం

సంస్థాపన: 2006లో Disaster Management Act, 2005 ప్రకారం ఏర్పాటైంది.
ముఖ్య ఉద్దేశ్యం:

  • భూకంపాలు, వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు,  రసాయన & జైవిక ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడం.
  • సహాయ చర్యలు & పునరుద్ధరణ పనులను సమర్థవంతంగా నిర్వహించడం.
  • విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం.

NDRF బలగాల నిర్మాణం : 

  • 12 బెటాలియన్లు (Battalions) ఉన్నాయి.
  • CAPF (Central Armed Police Forces) కి చెందిన BSF, CRPF, ITBP, CISF, SSB బలగాల నుంచి వీరు తీసుకుంటారు.
  • ప్రతి బెటాలియన్‌కి 1,000 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు.
  • భారతదేశవ్యాప్తంగా 16 ప్రధాన కేంద్రాలు ఉన్నాయి.

NDRF యొక్క ప్రధాన కర్తవ్యాలు :

  • భూకంపాలు, తుఫానులు, వరదల సమయంలో సహాయక చర్యలు
  • భూసంఖలనం, అగ్ని ప్రమాదాలు, రసాయన & అణు ప్రమాదాల నివారణ
  • జలప్రళయం వచ్చినప్పుడు బోట్ల ద్వారా సహాయ చర్యలు
  • భవనాలు, రోడ్లు కూలినప్పుడు సహాయం అందించడం
  • ప్రజలకు విపత్తు సమయంలో ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇవ్వడం

NDRF ప్రధానంగా పాల్గొన్న విపత్తులు :

  • 2008 బిహార్ వరదలు – వేల మందిని రక్షించారు.
  • 2013 ఉత్తరాఖండ్ వరదలు – 50,000 మందికి పైగా సహాయ కార్యక్రమాలు.
  • 2015 నేపాల్ భూకంపం – భారీ సహాయ చర్యలు చేపట్టారు.
  • 2018 కేరళ వరదలు – లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
  • 2020 COVID-19 మహమ్మారి – దేశవ్యాప్తంగా సహాయ చర్యలు.

National Disaster Management Official Website

Leave a Comment