1968లో భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) మద్దతుతో స్థాపించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD), దేశంలో టూల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక మార్గదర్శక సంస్థ. CITD లో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరికరాలు ఉన్నాయి. ఇక్కడ టూల్ ఇంజనీరింగ్, CAD/CAM, VLSI, మెకాట్రానిక్స్, 3D ప్రింటింగ్ మొదలైన అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇది విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలను అందించడంలో సహాయపడుతోంది. CITD యొక్క ప్రధాన కేంద్రం బాలానగర్, హైదరాబాద్‌లో ఉండగా, విజయవాడ మరియు చెన్నైలో బ్రాంచ్ క్యాంపస్‌లు ఉన్నాయి.
CITD కార్యకలాపాలు :
సాధనాలు, డైస్ మరియు అచ్చుల రూపకల్పన మరియు తయారీలో సాంకేతిక వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం.
డైస్, జిగ్స్, ఫిట్టింగ్స్ మరియు గేజ్‌లను రూపొందించడం మరియు ఉత్పత్తి చేయడం.
నిర్దిష్ట కార్యకలాపాల కోసం సాధనాలను ప్లాన్ చేయడం మరియు సృష్టించడంలో సహాయంతో సహా చిన్న వ్యాపారాలకు సలహా సేవలను అందించడం.
డై కోసం ప్రమాణాలను సిఫార్సు చేయడం
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ బాలానగర్ లో టెక్నికల్ ఉద్యోగాల ఎంపిక యొక్క విధివిధానాల పూర్తి సమాచారం కొరకు కింద ఇచ్చిన సమాచారం చదవగలరు.
ఈ సంస్థ నుండి Maintaince ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ సూపర్ వైసర్ ,క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఇంజనీర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. వివిధ పోస్టుల సమాచారం ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (B.Tech,డిప్లొమా,I.T.I) తో పాటు అనుభవo కలిగి ఉండాలి. వివిధ పోస్టుల ను బట్టి విద్యార్హతలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
ఎంపిక విధానం :
అభ్యర్థులు 19.03.2025 న ఉదయం 09:30 a.m. – 12:00 p.m గంటల మధ్య వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుతుంది.
CITD పోస్టులు పూర్తిగా కన్సాలిడేటెడ్ చెల్లింపుపై మరియు కాంట్రాక్టు ప్రాతిపదికన 11 నెలల కాలానికి ఉంటాయి, ఇది అభ్యర్థి పనితీరు సమీక్ష మరియు సంస్థ యొక్క అవసరాన్ని బట్టి కాలానుగుణంగా పునరుద్ధరించబడుతుంది.
అప్లికేషను ఫీజు :
CITD పోస్టులకు ఎటువంటి అప్లికేషను ఫీజు లేదు.
కావలసిన ధ్రువపత్రాలు :
Resume విత్ ఫోటో
విద్యార్హతల సర్టిఫికెట్లు (ఒరిజినల్ ) మరియు సెల్ఫ్ Attested ఫోటోకపీస్
2 thoughts on “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ బాలానగర్ లో టెక్నికల్ ఉద్యోగాలు | CITD Balanagar Vacancy Notification 2025 | Udyoga Varadhi”