CISF లో కానిస్టేబుల్ /ట్రేడ్ మెన్ ఉద్యోగాలు | CISF Constables/Tradesmen Notification 2025 | Udyoga Varadhi
Admin
CISF Constables/Tradesmen Notification 2025!
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) అనేది భారతదేశంలో హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే కేంద్ర సాయుధ పోలీసు దళం. CISF యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రభుత్వ లేదా ప్రైవేట్ యాజమాన్యంలోని పెద్ద సంస్థలకు భద్రత కల్పించడం. ఈ సంస్థ నుండి CONSTABLES/TRADESMEN ఉద్యోగాలకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, ముఖ్య తేదీలు, అప్లై చేసే విధానం ఇతర ముఖ్యమైన వివరాల కోసం కింద చూసుకోగలరు.
ఈ సంస్థ నుండి కుక్, కొబ్బలర్, టేలర్, బార్బర్, వాషర్ మెన్, స్వీపర్, పేయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలి, వెల్డర్ వంటి విభాగాల్లో CONSTABLES/TRADESMEN ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రీకులేషన్ లేదా తత్సమాన సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి అలాగే ITI సర్టిఫికేట్ ఉన్న వారికి skilled Trades మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.