భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) హైదరాబాద్ శాఖలో 2025 సంవత్సరానికి టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ. 1954లో స్థాపించబడిన ఈ సంస్థ రక్షణ, వైమానిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వంటి కీలక రంగాలకు అధునాతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. BEL వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి కేంద్రాలు కలిగి ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో కూడా BEL కార్యకలాపాలు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో BEL యూనిట్ – ఇది అధునాతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పనిచేస్తోంది. డిఫెన్స్ & ఎలక్ట్రానిక్స్ పరిశోధన కేంద్రాలు – హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన డిఫెన్స్, DRDO ప్రాజెక్టులకు BEL సహకారం అందిస్తోంది. నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, జీతం, అప్లికేషన్ విధానం వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.
రాడార్లు – మిలిటరీ, నావికాదళం, వైమానిక దళానికి అత్యాధునిక రాడార్ వ్యవస్థలు.
నైట్ విజన్ పరికరాలు – సైనికులకు రాత్రి సమయంలో స్పష్టమైన దృశ్యాన్ని అందించడం
కమ్యూనికేషన్ వ్యవస్థలు – రక్షణ విభాగం కోసం ప్రత్యేకమైన కమ్యూనికేషన్ పరికరాలు.
ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు – శత్రు లక్ష్యాలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు.
పోస్టుల వివరాలు :
హైదరాబాద్‌లోని BEL విభాగంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్‘C’, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 32
పోస్టును అనుసరిoచి సంబందిత విభాగంలో డిప్లొమా,ITI,B.Com,లలోవిద్యార్హతను కలిగి ఉండాలి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (EAT): సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ ‘C’: SSLC, ITI మరియు 1 సంవత్సరం అప్రెంటిస్‌షిప్ లేదా SSLC మరియు 3 సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కోర్సు పూర్తి చేసి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్: B.Com లేదా BBM (3 ఏళ్ల కోర్సు) పూర్తి చేసి ఉండాలి.
జీతం:
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్‘C’, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి నెలకు ₹24,500 నుంచి ₹90,000 పోస్టును బట్టి పే స్కేలు తో జీతం ఇవ్వడం జరుగుతుంది, జీతం తో పాటు అన్నీ రకాల allowance కూడా లభించడం జరుగుతుంది.
వయస్సు :
01.03.2025 నాటికీ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్‘C’, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వయస్సు 28 ఏళ్ళు ఉండాలి.
Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు,SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.
కావలసిన పత్రాలు :
SSC ,ఇంటర్, డిగ్రీ, సర్టిఫికేట్స్
Caste/Pwd సర్టిఫికేట్స్
ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹250.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ పరీక్షా అనుగుణంగా 150 మార్కులకు ఉంటుంది.
పార్ట్ 1 : జనరల్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు
General Mental Ability, Logical Reasoning,Data Numeracy,General Knowledge
2 thoughts on “భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఇంజినీరింగ్ టెక్నీషియన్ ఉద్యోగాలు | BEL Hyderabad Notification 2025 | Udyoga Varadhi”