బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) అనేది గుజరాత్‌లోని వడోదరలో ప్రధాన కార్యాలయం కలిగిన భారత ప్రభుత్వ ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.2023 స్టాటిస్టికల్ డేటా లెక్కల ఆధారంగా, ఇది ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో 586 వ స్థానంలో ఉంది. బరోడా మహారాజు, సాయాజీరావు గైక్వాడ్-III, జూలై 20, 1908న గుజరాత్‌లోని బరోడా రాచరిక రాష్ట్రంలో ఈ బ్యాంకును స్థాపించారు. భారత ప్రభుత్వం 13 ఇతర ప్రధాన వాణిజ్య బ్యాంకులతో పాటు, బ్యాంక్ ఆఫ్ బరోడాను జూలై 19, 1969న జాతీయం చేసింది మరియు ఈ బ్యాంకును లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థ (PSU)గా నియమించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ నుండి వివిధ విభాగాలలో 146 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివిధ విభాగాలలోని పోస్టుల వివరాలు, విద్యార్హత, జీతం, వయస్సు, ఎంపిక విధానం, పరీక్ష విధానం, అప్లికేషన్ ఫీజ్, ముఖ్యమైన తేదీలు వంటి ముఖ్యమైన సమాచారం కోసం కింద ఇచ్చిన వివరాలను చూడండి.
బ్యాంక్ ఆఫ్ బరోడా లో డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ సలహాదారు, ప్రైవేట్ బ్యాంకర్, గ్రూప్ హెడ్,టెరిటరీ హెడ్, సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్, సంపద వ్యూహకర్త (పెట్టుబడి & భీమా), ఉత్పత్తి అధిపతి, పోర్ట్‌ఫోలియో పరిశోధన విశ్లేషకుడు, తదితరాలు పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 146
విద్యార్హతలు:
పోస్టును అనుసరిoచి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ తో పాటు అనుభవం కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్‌లో వివరించబడింది.
వివిధ పోస్టులకు వార్షిక జీతం ₹.6,00,000 నుంచి ₹.28,00,000 పోస్టును బట్టి పే స్కేలు ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
వివిధ పోస్టులకు కనీస వయస్సు 22ఏళ్ళు, గరిష్టంగా 57 ఏళ్ళు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు, SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.
కావలసిన పత్రాలు :
SSC ,ఇంటర్, డిగ్రీ, సర్టిఫికేట్స్
Experienceసర్టిఫికేట్
Caste/Pwd సర్టిఫికేట్స్
ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు వివరాలు:
GENERAL, EWS & OBC అభ్యర్థులు ₹. 600/-+ Applicable Taxes
SC/ST/PWDB/ Women అభ్యర్థులకు ₹. 100/-+ Applicable Taxes
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.