ISRO Engineer Recruitment 2025!
భారత ప్రభుత్వం యొక్క ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO Indian Space Research Organisation లో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ISRO భారతదేశం కోసం స్వదేశీ సాంకేతికతతో అంతరిక్ష సంబంధిత ప్రయోగాలు అభివృద్ధి చేస్తుంది. 2014 లో మంగళయాన్ ద్వారా ISRO ప్రపంచంలో మొట్టమొదటి ప్రయత్నంలో మార్స్ (అంగారక గ్రహం) కు చేరిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్-3 ద్వారా చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 63
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BE / B.Tech డిగ్రీ లోని సంబంధిత విభాగాల్లో (ఇలక్ట్రానిక్స్ / మెకానికల్ / కంప్యూటర్ సైన్స్), కనీసం 65% మార్కులు లేదా 6.84 CGPA ఉండాలి. సైంటిస్ట్/ఇంజినీర్ ‘SC’ స్థాయిలో ఉద్యోగాలకు సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.
వయస్సు :
సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి 21 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.
జీతం :
సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు ₹.56,100/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అల్లోవన్సు లు ఉంటాయి.
ఎంపిక విధానం :
-
ఇంటర్వ్యూకు ఎంపిక (Shortlisting) GATE పరీక్షలో పొందిన GATE స్కోర్ ఆధారంగా జరుగుతుంది. ఇది GATE మార్కులు లేదా ర్యాంక్ ఆధారంగా కాదు. ప్రతి పోస్టుకు 1:7 నిష్పత్తిలో అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపిక చేయబడతారు (ఒక పోస్టుకు గరిష్ఠంగా 7 మంది అభ్యర్థులు)
-
ఇంటర్వ్యూలో మూల్యాంకనం (100 మార్కుల కింద):
-
సాంకేతిక (విద్యా) జ్ఞానం – 40 మార్కులు
-
విశేషతతో సంబంధిత సాంకేతిక సామాన్య అవగాహన – 20 మార్కులు
-
ప్రదర్శన / సంభాషణ నైపుణ్యం (Presentation/Communication) – 20 మార్కులు
-
గ్రహణశక్తి (Comprehension) – 10 మార్కులు
-
విద్యా సాధన / ప్రత్యేకతలు (Academic Achievements) – 10 మార్కులు
-
కావలసిన ధృవపత్రాలు :
-
Original Education Certificates
-
Caste/Pwd Certificates
- Aadhar/Pan Card
దరఖాస్తు రుసుము:
General/OBC/EWS అభ్యర్థులకు ₹.250/-,
SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషను చివరి తేదీ : 19.05.2025