భారతీయ పరిశోధనా మండలి (CSIR) కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ఉంది. ఇది 1944లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CLRI) శాఖగా ప్రారంభమైంది. ఆ తరువాత, దీన్ని రీజినల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (RRL), హైదరాబాదు గా పునర్‌నామకరణం చేశారు. 1989లో, దేశీయ పరిశ్రమలకు మరియు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు మరింత సహాయపడేందుకు, దీన్ని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) గా మార్చారు. ఈ సంస్థ రసాయన శాస్త్రం, బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధనలు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, నూతన సాంకేతికతల అభివృద్ధి వంటి విభాగాల్లో ముఖ్యమైన పరిశోధనలు చేస్తోంది. IICT నేషనల్, ఇంటర్నేషనల్ పరిశ్రమలకు, ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం, CSIR-IICT పరిశోధనలు, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, మరియు దేశ అభివృద్ధికి సహాయపడే అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు చేపడుతోంది. CSIR-IICT లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల ఎంపిక యొక్క విధివిధానాల పూర్తి సమాచారం కొరకు కింద ఇచ్చిన సమాచారం చదవగలరు.
ఈ సంస్థ నుండి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ వంటి పోస్టులు వివిధ గవర్నమెంట్ విభాగాల్లో ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. వివిధ పోస్టుల సమాచారం ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (B.Sc,M.Sc,B.Tech,M.Tech) తో పాటు కెమిస్ట్రీ మరియు కెమికల్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. వివిధ పోస్టుల ను బట్టి విద్యార్హతలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
అభ్యర్థులు 20.03.2025న ఉదయం 09.30 నుండి 10.30 గంటల మధ్య వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుతుంది.
జీతం :
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ వంటి పోస్టులకి జీతం Rs. 20,000/- to Rs. 42,000/-
వయస్సు :
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ వంటి పోస్టులకి అప్లై చేయాలనుకునే వారి వయస్సు గరిష్ట వయోపరిమితి 35 నుంచి 40 మధ్యలో ఉండాలి.
RELAXATION:
నోట్: భారత ప్రభుత్వం/CSIR సూచనల ప్రకారం చట్టబద్ధమైన సమూహాల (SC/ST/OBC/మహిళలు) మరియు PWD అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషను ఫీజు :
CSIR-IICT లో ఈ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు ఎటువంటి అప్లికేషను ఫీజు లేదు.
3 thoughts on “CSIR ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తార్నాక లో ఉద్యోగాలు | CSIR IICT Tarnaka Notification 2025 | Udyoga Varadhi”