UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ లో 705 మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలు | UPSC CMS 705 Medical Officers Recruitment 2025 | Udyoga Varadhi

UPSC CMS 705 Medical Officers Recruitment 2025!

                                ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయబడినదే, ఈ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CMS). IAS, IPS, IFoS వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సమానమైన CMS ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. CMS కు సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ AIIMS వంటి సంస్థలలో, సెంట్రల్ హెల్త్ సర్వీస్ (CHS), ఇండియన్ రైల్వేస్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మరియు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వంటి వివిధ ప్రభుత్వ సేవలు/సంస్థలకు మెడికల్ ఆఫీసర్ల (గ్రూప్ A పోస్టులు) నియామకం కోసం యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ (UPSC) కంబైండ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లేదా CMS పరీక్షల నిర్వహిస్తుంది.
                            CMS వంటి ఉన్నత ఉద్యోగాల భర్తీ లో UPSC కఠినమైన పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్ష యొక్క విధివిధానాల పూర్తి సమాచారం కొరకు కింద ఇచ్చిన వివరాలను చదవగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు:

Category-l: Medical Officers Grade in General Duty Medical Officers Sub-cadre of Central Health Service – 226
Category-ll:
i) Asst. Divisional Medical Officers in the Railways – 450
ii) General Duty Medical Officer in New Delhi Municipal council – 09
iii) General Duty Medical Officer Gr-ll in Municipal Corporation of Delhi – 20

యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో అప్రెంటిస్ 2691 ఖాళీలు

విద్యార్హతలు:

అభ్యర్థి MBBS ఉత్తీర్ణులై ఉండాలి లేదా MBBS చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్ష రాయడానికి అర్హులు.
Note: కమాండ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2025కి సంబంధించిన ఫిజికల్/మెడికల్ ప్రమాణాల ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా శారీరకంగా మరియు వైద్య పరంగా ఫిట్ గా ఉండాలి.

Eligibility Criteria:

Nationality(జాతీయత): భారత పౌరుడు; నేపాల్ లేదా భూటాన్ పౌరులు; మరియు కొంతమంది టిబెటన్ శరణార్థులు, పాకిస్తాన్, బర్మా, శ్రీలంక లేదా తూర్పు ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా, మలావి, జైర్ మరియు ఇథియోపియా లేదా వియత్నాం నుండి భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యంతో వలస వచ్చిన భారత సంతతికి చెందిన వ్యక్తులు.

Salary: 

₹. 56,100 –₹. 1,77,500

Age Limit:

01.08.2025 నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న జనరల్ అభ్యర్థులు CMS 2025 పరీక్షకు అర్హులు.
Note: మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ పోస్టుల కోసం 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
* SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
* OBC-NCL అభ్యర్థులకు 3 సంవత్సరాలు
* Ex-SM అభ్యర్థులకు 5 సంవత్సరాలు
* PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసులో సడలింపు కలదు.

SCHEME OF EXAMINATION

తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు: అభ్యర్థులు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నపత్రాల్లో తప్పు సమాధానాలు గుర్తించినట్లయితే, ప్రతి తప్పు సమాధానంకు 1/3వ వంతు చొప్పున మార్కులు తగ్గించబడతాయి.

ఫీజు వివరాలు:

* జనరల్ అభ్యర్థులందరికీ ₹. 200/- కలదు.
* Female/SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు కలదు.

అప్లై చేయుటకు చివరి తేదీ:

11.03.2025 రోజున సాయంత్రం 06.00 గంటలలోపు అప్లై చేయుటకు అవకాశం కలదు.

దరఖాస్తు చేయు విధానం:

అర్హత గల అభ్యర్థులు https://upsconline.gov.in వెబ్ సైట్ ను ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) ప్లాట్ ఫారంలో ముందుగా అభ్యర్థి అర్హతకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. OTR Profile (Registration) ను జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకుంటే సరిపోతుంది.

ఆన్లైన్ దరఖాస్తులో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయు విధానం:

A. అభ్యర్థి అప్ లోడు చేసిన ఫోటో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి పది రోజుల కంటే పాత ఫోటో కాకూడదు.
B. ఫోటోగ్రాఫ్ పై అభ్యర్థి పేరు మరియు ఫోటో తీయబడిన తేదీ స్పష్టంగా పేర్కోవాలి.
C. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ టెస్టు సమయంలో అప్లికేషన్ చేయు సమయంలో ఉండే ఫోటోతో, వారి మొఖం సరిపోవాలి. ఉదాహరణకు, ఒక అభ్యర్థి గడ్డం ఉన్న ఫోటోను అప్లోడ్ చేస్తే, అతను తప్పనిసరిగా ప్రాతపరీక్ష, ఇంటర్వ్యూ టెస్టుల్లో అదే లుక్కుతో కనిపించాలి. కళ్లద్దాలు, మీసాలు మొదలైన వాటి విషయంలో కూడా అలాగే ఉంటుంది.
Note: అభ్యర్థులు పరీక్ష యొక్క ప్రతి సెషన్ ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను, ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా వేదిక లోపలికి అనుమతించబడదు.

Websites:

Official Website
Official Notification
Online Application link

UPSC IES & ISS ఉద్యోగాల నోటిఫికేషన్ 2025

Centres of Examination:

2 thoughts on “UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ లో 705 మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలు | UPSC CMS 705 Medical Officers Recruitment 2025 | Udyoga Varadhi”

Leave a Comment