యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, సాధారణంగా యూనియన్ బ్యాంక్ అని పిలుస్తారు, ఇది ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది డిసెంబర్ 31, 2024 నాటికి మొత్తం వ్యాపారం రూ.21,65,726 కోట్లను కలిగి ఉంది. 1 ఏప్రిల్ 2020న అమల్లోకి వచ్చిన కార్పొరేషన్ బ్యాంక్ మరియు ఆంధ్రా బ్యాంక్‌లతో విలీనం తర్వాత, విలీనమైన సంస్థ దాదాపు 9300+ శాఖలతో బ్రాంచ్ నెట్‌వర్క్ పరంగా అతిపెద్ద PSU బ్యాంకులలో ఒకటిగా మారింది. ఈ బ్యాంకు 9300+ దేశీయ శాఖలు, 10000+ ATMలు మరియు 18000+ బిజినెస్ కరస్పాండెంట్ పాయింట్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, 76,700+ ఉద్యోగులతో 153 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అప్రెంటిస్ 2691 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన రాష్ట్రాలవారీగా అప్రెంటిస్ వేకెన్సీస్, వయస్సు, విద్యార్హతలు, అప్రెంటిస్ కాలపరిమితి, స్టైఫండ్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజ్ మరియు తదితర పూర్తి సమాచారం కోసం కింద ఇవ్వబడిన సమాచారం చూడండి.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 01.04.2021 తర్వాత బ్యాచిలర్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
శిక్షణ వ్యవధి:
శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం పాటు ఉంటుంది. అప్రెంటిస్ కు బ్యాంకింగ్ పద్ధతులు, ఉత్పత్తులు మరియు ప్రక్రియల యొక్క వివిధ అంశాలపై ఉద్యోగ శిక్షణ ఇవ్వబడుతుంది.
స్టైఫండ్:
అప్రెంటిస్టులు స్టైఫండ్ అర్హులు. ఒక సంవత్సరం కాలానికి నెలకు ₹. 15,000/- చొప్పున చెల్లిస్తారు.
వయస్సు:
అభ్యర్థులు 01-02-2025 తేదీ నాటికి 20-28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. SC/ST/OBC/PwBD కేటగిరీల అభ్యర్థులకు వయస్సు లో సడలింపు కలదు. * SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు * OBC – NCL అభ్యర్థులకు 3 సంవత్సరాలు * PwBD అభ్యర్థులకు 10 10 సంవత్సరాలు వయసులో సడలింపు కలదు.
ఎంపిక ప్రక్రియ:
ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున, 100 ప్రశ్నలకు, 100 మార్కులు కలవు. మొత్తం పరీక్షా సమయం 60 నిమిషాలు మాత్రమే.
2 thoughts on “యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో అప్రెంటిస్ 2691 ఖాళీలు | UBI 2691 Apprentice Vacancies 2025 | Udyoga Varadhi”