దేశం లో 2014 సంవత్సరం లో, 28 వ రాస్ట్రం గా ఏర్పడిన తరువాత తెలంగాణ రాస్ట్రం లో మొదటి సారిగా 2022 లో గ్రూప్ l, 503 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. వివిధ కారణాల వల్ల 2022 లో మొదటి సారి, 2023 లో రెండవ సారి రద్దు చేయబడి, 2024 లో మరో 60 పోస్టులు కలుపుకొని, 563 పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ వెలువడింది.
ఈ గ్రూప్ l పరీక్ష కు తెలంగాణా రాష్ట్రం తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 4,03,667 మంది TGPSC కి ధరాఖాస్తూ చేసుకున్నారు. రాస్ట్రం లో అత్యధికంగా మేడ్చల్-మల్కజ్ గిరి జిల్లా నుండి 69,727 మంది, రంగారెడ్డి జిల్లా నుండి 55,692 మంది, హైదరాబాద్ జిల్లా నుండి 40,569 మంది విద్యార్థులు, అలాగే అత్యల్పంగా కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి 2,783 మంది, యాదాద్రి-భువనగిరి జిల్లా నుండి 3,349 మంది, జనగాం జిల్లా నుండి 3,697 మంది విద్యార్థులు గ్రూప్ l పరీక్ష కు అప్లై చేసుకున్నారు.
గ్రూప్ l ప్రిలిమినరీ పరీక్షకు సంబందించిన ఫలితాలను పబ్లిక్ సర్విస్ కమిషన్ వారు జూలై 07, 2024 రోజున విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో Group 1 Mains పరీక్షకు 1:50 చొప్పున 31,383 మంది అభ్యర్ధులు అర్హత సాదించడం జరిగింది.
గ్రూప్ l ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తరువాత అర్హత సాదించిన అభ్యర్థులకు 3 నెలల సమయం ఇచ్చి గ్రూప్ l Mains పరిక్షలను October, 2025 లో Schedule చేయడం జరిగింది.
TGPSC వారు నిర్ణయించిన తేదిల ప్రకారం గ్రూప్ l Mains పరిక్షలను నిర్వహించడం జరిగింది. గ్రూప్ l Mains పరిక్షకు 31,383 మంది అభ్యర్ధులు అర్హత సాదిస్తే, మొత్తం 7 పేపర్లకు హాజరు అయ్యింది మాత్రం 21,093 (67.17%) అభ్యర్థులు మాత్రమే.
Category వారిగా Mains Examination కు అర్హత సాదించిన అభ్యర్థులు.
Note : 18 Sports Candidates who obtained High Court orders appeared for all Exams.
TGPSC Group 1 Examination కు వివిధ దశలలో అభ్యర్థులు మరియు పోస్ట్ ల మధ్య నిష్పత్తి ఈ కింది విధంగా ఉండడం జరిగింది.
చివరగా TGPSC వారు Group 1 Mains కు సంబందించిన Candidate Individual గా పరీక్షా ఫలితాలను March 10, 2025 న విడుదల చేయడం జరిగింది.
March 30, 2025 Group 1 Mains కి సంబందించిన General Ranking List ను విడుదల చేసారు. TGPSC ప్రకటించిన ఫలితాలలో English Qualifying Paper తో పాటు, మిగతా 6 పేపర్లలో అర్హత సాదించిన వారు 12622 అభ్యర్థులు మాత్రమే.
కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగుల Group 1 కు సంబందించిన 10 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. ఈ 10 సంవత్సరాల కాలంలో Group 1 Aspirants ఎన్నో అవరోధాలను ఎదురుకొని, ఓపికతో కష్ట నష్టాలను భరిస్తూ తమ ప్రయత్నాన్ని వదలకుండా చివరకు విజయాన్ని సాదించారు. ఇంకా ఎవరైనా తమ Group 1 ఆశయాన్ని సాదించలేక పోయారో వారు నిరుత్స్తాహపడకుండా, త్వరలో రాబోయే Group 1 & Group 2 పరిక్షలకు Prepare అవుతూ, అందులో విజయం సాదిస్తారని మా Udyoga Varadhi Team కోరుకుంటున్నాం……………..
2 thoughts on “తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల విశ్లేషణ | TGPSC Group 1 Analysis on Results | Udyoga Varadhi”