Udyoga Varadhi

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు | TGHCL Notification 2025| Udyoga Varadhi

TGHCL Notification 2025!

            తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఏడాది కాలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGHCL) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGHCL) ప్రతి BPL కుటుంబానికి శాశ్వత (పక్కా) ఇళ్ల నిర్మాణంలో ఆర్థికంగా మరియు సాంకేతికంగా సహాయం చేసి ప్రతి పేద కుటుంబానికి స్థిర నివాసం కలిపించాలని లక్ష్యం తో ఏర్పడడం జరిగింది. ఈ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అర్హులైన పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం యొక్క వివిధ పథకాల ప్రకారం ఆర్థిక సహాయం అందించబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం పేదలకు స్వంత ఇంటి కల్పనకై ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది, దీనికి గాను అవసరమైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లను నియమించడానికి ఉద్యోగ నోటిఫికేషన్ ను ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టు లకు అప్లై చేసుకోగలరు.

TGHCL Notification 2025

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు:

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరగింది.

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Tech సివిల్ ఇంజనీరింగ్ లో Bachelor Degree ని పూర్తి చేసి ఉండాలి.

జీతం వివరాలు:

ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹.33,800/- జీతం ఉంటుంది.

వయస్సు:

ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో ఉద్యోగాలు 2025

కావలసిన పత్రాలు :

ఎంపిక విధానం:

ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిక అనేది పరీక్ష లేకుండానే ఇంజనీరింగ్ డిగ్రీ లో సాదించిన మార్క్స్ merit ప్రకారం ఎంపిక చేయబడును. ఈ ఎంపిక అనేది M/s Mankind Enterprises, Outsourcing Agency ద్వారా ఒక సంవత్సర కాలనీ outsouring బేసిస్ లో నియమించడం జరుగుతుంది.

పరీక్ష ఫీజు :

ఈ పోస్టు లకు అప్లై చేసే అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు.

దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లై చేయుటకు చివరి తేదీ: 11.04.2025
ముఖ్యమైన links :

Official Website

Official Notification

Online Application link

ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లో ఉద్యోగాలు

Exit mobile version