తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET – 2025) నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణా రాష్ట్ర పీజీఈసెట్ (TG PGECET) అనేది తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ డిగ్రీ (M.E./M.Tech./M.Pharmacy) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ (JNTUH) నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర Post గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET) అనేది 2014 లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా TG PGECET ప్రవేశ పరీక్షను ప్రారంభించింది. ఈ పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ (JNTUH) నిర్వహిస్తుంది. 2015 నుండి ఇది స్వతంత్రంగా నిర్వహించబడింది, అప్పటివరకు అభ్యర్థులు AP PGECET లేదా ఇతర జాతీయ స్థాయి పరీక్షల ద్వారా ప్రవేశం పొందేవారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలు, అనుబంధ ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కళాశాల లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందవచ్చును. ఈ TG PGECET 2025 కు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు కింద ఇచ్చిన సమాచారాన్ని చూడగలరు.
ఫుల్ టైం M.Tech/M.E,M.Arch.,M. Pharmacy, బయో మెడికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్,సివిల్ ఇంజనీరింగ్,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ etc…
విభాగాలు:
ఏరో స్పేస్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్,బయో టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్,సివిల్ ఇంజనీరింగ్,కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్ మెంటల్ మేనజ్ మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్,మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికాల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ, టెక్స్ టైల్ టెక్నాలజీ.
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E./B.Tech,బీ ఫార్మసీ వంటి మొదలగు కోర్సును అనుసరంచి విద్యార్హత కలిగి ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు :
ఎంపిక విధానం :
మోడ్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
ప్రశ్నల సంఖ్య: 120 బహుళ ఎంపిక ప్రశ్నలు
మాధ్యమం: ఇంగ్లీష్
వ్యవధి: 2 గంటలు
మార్కింగ్ పద్ధతి: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు; నెగటివ్ మార్కింగ్ లేదు.
సిలబస్:
TG PGECET సిలబస్‌లో మాథమెటిక్స్ మరియు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
GATE/GPAT అర్హత సాధించిన అభ్యర్థులను చేర్చుకున్న తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను TG PGECET-2025 ద్వారా భర్తీ చేస్తారు.
ప్రవేశ పరీక్ష లో సాధించిన ర్యాంక్/పర్సంటైల్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
GATE/GPAT అభ్యర్థులకు M.E. / M.Tech. / M.Pharm. / M.Arch. / గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మ్.D (P.B.) కోర్సులలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్ సైటు లో ఇచ్చిన లింకు ద్వారా పూర్తి వివరలాను ఇచ్చి ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.
‘ఆన్‌లైన్ దరఖాస్తు’ లింక్‌పై క్లిక్ చేయండి.
వివరాలను నమోదు చేసి, ఫోటో మరియు సిగ్నేచర్‌ను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజును చెల్లించండి.
దరఖాస్తును సమర్పించి, ప్రింట్ తీసుకోండి.
పరీక్షా ప్రాంతీయ కేంద్రాలు :
హైదరాబాద్
వరంగల్
TG PGECET 2025 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:17.03.2025
దరఖాస్తు చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా): 19.05.2025
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ తేదీ: 07.06.2025
పరీక్ష తేదీలు: 16.06.2025 నుండి 19.06.2025
సబ్జెక్ట్ వారిగా పరీక్షా Schedule:
మరిన్ని వివరాల కోసం:
TG PGECET 2025 నోటిఫికేషన్ మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింది ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
3 thoughts on “తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ | TG PGECET Notification 2025 | Udyoga Varadhi”