Udyoga Varadhi

రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు | RRB ALP Notification 2025 | Udyoga Varadhi

RRB ALP Notification 2025!

రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ (RRCB) చే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ ను జారి చేయబడింది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ (RRCB) అనేది  భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) కింద 1998లో స్థాపించబడి రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించి నియామకాలు మరియు వాటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఈ  రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ (RRCB) ALP, Technician , Non-Technical Popular Categories (NTPC) Junior Engineer లాంటి పోస్టు లను భర్తీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం, వివిధ నగరాల్లో 21 RRBలు ఉన్నాయి.
భారత దేశం లో గల వివిధ నగరాల్లోని రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ లు

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ నుండి (Assistant Loco Pilot – ALP)  ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. దీనికి సంబందించిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలు లాంటివి ముఖ్యమైన విషయాలను కింద ఇవ్వడం జరిగింది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.

విద్యార్హతలు :

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు కింద ఇవ్వనైనది
మెట్రిక్యులేషన్ / SSLC ప్లస్ గుర్తింపు పొందిన NCVT/SCVT సంస్థల నుండి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్స్ లో ITI. మెకానిక్, మెకానిక్ (రేడియో & టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వాహనం), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ & కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్.

(Or)

మెట్రిక్యులేషన్ / SSLC ప్లస్ కోర్సు పైన పేర్కొన్న ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయాలి

(Or)

మెట్రిక్యులేషన్ / SSLC ప్లస్ మూడేళ్లు మెకానికల్ / ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (OR) వీటిలో వివిధ విభాగాల కలయిక గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంజనీరింగ్ విభాగాలు ITIకి బదులుగా. గమనిక: పైన పేర్కొన్న ఇంజనీరింగ్ విభాగాలలో డిగ్రీ కూడా ఇంజనీరింగ్ డిప్లొమాకు బదులుగా ఆమోదయోగ్యమైనది.

IIFCL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో మేనేజర్ ఉద్యోగాలు

వయస్సు :

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారి వయస్సు 01.07.2025 నాటికి 18-30 సం రాల మద్య ఉండాలి. వివిధ Category వారికి Age Relaxation ఈ కింది విధంగా ఉంటుంది.

RELAXATION

జీతం :

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు 7th CPC లో Level-2 కింద Rs. 19900 బేసిక్ పే ఉంటుంది వీటితో అన్ని రకాల allowances కూడా ఉంటాయి.

ఎంపిక విధానం :

  1. మొదటి దశ Computer Based Test (CBT)
  2. రెండవ దశ Computer Based Test (CBT)
  3. Computer Based Aptitude Test (CBAT)
  4. Document Verificaiton
  5. Medical Examination
Computer Based Test Exam Pattern

Computer Based Aptitude Test
Psychology Test ఈ టెస్ట్ పూర్తి వివరాలకై కింద ఇచ్చిన లింక్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

https://rdso.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,2,456,5821,6119.

Note : నెగెటివ్ మార్కింగ్: CBT-1 మరియు CBT-2 రెండింటిలోనూ నెగెటివ్ మార్కింగ్ (ప్రతి తప్పు సమాధానానికి @1/3వ మార్కు) ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)లో నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
Medical Examination
DV కి పిలవబడే అభ్యర్థులు రైల్వే అడ్మినిస్ట్రేషన్ నిర్వహించే వైద్య ఫిట్‌నెస్ పరీక్ష(లు)లో ఉత్తీర్ణులు కావాలి. ఈ పోస్టుకు సంబంధించిన విధులను నిర్వర్తించడానికి వారు శారీరకంగా దృఢంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి. రైల్వే సేవకు విజువల్ అక్యూటీ స్టాండర్డ్ ఒక ముఖ్యమైన వైద్య ఫిట్‌నెస్. ఈ CEN యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ పదవికి వైద్య అవసరాలు క్రింద వివరించబడ్డాయి:

పోస్టింగ్ :

అభ్యర్థి ఏ RRB కింద అప్లై చేసుకుంటాడో ఆ RRB Zonal పరిధిలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా, ఒక రైల్వే ఉద్యోగి తన మొదటి నియామకంలో నియమించబడిన జోనల్ రైల్వే లేదా ప్రొడక్షన్ యూనిట్‌లో తన సర్వీసు అంతటా పనిచేస్తాడు మరియు మరొక రైల్వే లేదా మరొక సంస్థకు బదిలీ హక్కును కలిగి ఉండడు. అందువల్ల అభ్యర్థులు తగిన జాగ్రత్త మరియు పరిశీలనతో వారి RRBని ఎంచుకోవాలి.

ట్రైనింగ్ పీరియడ్ :

అన్నీ టెస్టుల్లో పాసైన అభ్యర్థులకు ఒక సం పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, ALP పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన చోట శిక్షణ పొందవలసి ఉంటుంది మరియు శిక్షణ కాలంలో స్టైఫండ్ మాత్రమే చెల్లించబడుతుంది.
ఎంపికైన అభ్యర్థులు అవసరమైతే సెక్యూరిటీ బాండ్ ఇవ్వవలసి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి అప్లై చేసే వారికి పరీక్షా ఫీజు కింది విధంగా ఉంటుంది.
General అభ్యర్థులకు Rs. 500/-
SC, ST, Ex-Servicemen, Female, Transgender, Minorities or Economically Backward Class (EBC) అభ్యర్థులకు Rs. 250/-

అప్లికేషన్ విధానం:

అధికారిక RRB వెబ్ సైటు లో ఇచ్చిన లింకు ద్వారా పూర్తి వివరలాను ఇచ్చి ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ తేదీ : 29.03.2025
అప్లికేషను ప్రారంభ తేది : 12.04.2025
అప్లికేషను చివరి తేది : 11.05.2025
ఫీజు చెల్లించుటకు చివరి తేది : 13.05.2025
అప్లికేషను modify చేసుకొనుటకు తేదిలు : 14.05.2025 to 23.05.2025

ముఖ్యమైన వెబ్ సైటు:

Official Website
Notification
RRB’s Website Links

TG GPO 10,956 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్

Exit mobile version