రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో ప్రోఫెషనల్స్ ఉద్యోగాలు | RFCL Professionals Recruitment 2025 | Udyoga Varadhi
Admin
RFCL Professionals Recruitment 2025!
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ నియామకానికి 2025 మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 40 పోస్టులను వివిధ విభాగాలలో భర్తీ చేయనున్నారు. RFCL (Ramagundam Fertilizers and Chemicals Limited) అనేది భారతదేశంలోని ఒక ప్రముఖ ఎరువుల సంస్థ. ఇది తెలంగాణలోని రామగుండం ప్రాంతంలో ఉంది. RFCL ను National Fertilizers Limited (NFL), Engineers India Limited (EIL), మరియు Fertilizer Corporation of India (FCIL) కలిసి ఏర్పరిచాయి. ఈ సంస్థ ముఖ్యంగా యూరియా ఎరువులను ఉత్పత్తి చేస్తుంది, భారతదేశంలోని రైతులకు అందించబడుతుంది. ఇది దేశంలోని ఎరువుల అవసరాలను తీర్చడంలో మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. RFCL ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ, పర్యావరణహిత విధానాలను అనుసరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, జీతం, అప్లికేషన్ విధానం వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.
RFCL విభాగంలో ఇంజనీర్ (కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్ ల్యాబ్),మెడికల్ ఆఫీసర్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, తదితరాలు పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 40
విద్యార్హతలు :
పోస్టును అనుసరిoచి సంబందిత విభాగంలో B.Tech,B.Sc,MBA,CA,MBBS లలో విద్యార్హతను కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్‌లో వివరించబడింది.
జీతం:
ఇంజనీర్ (కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్ ల్యాబ్), అకౌంట్స్ ఆఫీసర్,మెడికల్ ఆఫీసర్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, తదితరాలుపోస్టుల ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి నెలకు ₹.40,000 నుంచి ₹.2,60,000 పోస్టును బట్టి పే స్కేలు తో జీతం ఇవ్వడం జరుగుతుంది, జీతం తో పాటు అన్నీ రకాల allowance కూడా లభించడం జరుగుతుంది.
వయస్సు :
01.03.2025 నాటికీ ఇంజనీర్ పోస్టులకు: గరిష్టంగా 30 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 40 సంవత్సరాలు, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 45 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు,SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.