రాజీవ్ యువ వికాసం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి | Rajiv Yuva Vikasam Scheme 2025 | Udyoga Varadhi
Admin
Rajiv Yuva Vikasam Scheme 2025!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం ద్వారా సుమారు 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సుమారు రూ.6 వేల కోట్ల నిధులను కేటాయించింది. రాజీవ్ యువ వికాసం పథకం గురించి మరింత సమాచారం కోసం, అప్లికేషన్ విధానం వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.
రాజీవ్ యువ వికాసం పథకం ముఖ్య లక్ష్యాలు :
నిరుద్యోగ యువతకు సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నం ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు ఆర్థిక వృద్ధి మరియు సామాజిక అభ్యున్నతి అనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.
అర్హులైన యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించండి.
వ్యవస్థాపక స్ఫూర్తిని మరియు ఆర్థిక స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థిర నివాసి అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగి అయి ఉండాలి. ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పత్రాలు సమర్పించాలి.
రాజీవ్ యువ వికాసం పథకం స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయడానికి ₹3 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రుణ మరియు సబ్సిడీ వివరాలను కింద చూడవచ్చు.
రుణాలను మూడు కేటగిరీలుగా విభజించి మంజూరు చేస్తారు
1. కేటగిరీ-1: రూ.1 లక్ష వరకు రుణం; 80% రాయితీ, ఉండగా మిగత 20% లబ్ధిదారుడు భరించాలి.
2. కేటగిరీ-2: రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం; 70% రాయితీ, ఉండగా మిగత 30% లబ్ధిదారుడు భరించాలి.
3. కేటగిరీ-3: రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణం; 60% రాయితీ, ఉండగా మిగత 40% లబ్ధిదారుడు భరించాలి.
యూనిట్స్:
కింద ఇచ్చిన యూనిట్స్ ప్రకారం వ్యాపారాలు ప్రారంబించడానికి ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ వ్యాపార యూనిట్స్ కు సంబంధించి పూర్తి వివరాలను చూడవచ్చు.