POWERGRID దాదాపు 1,79,594 km ట్రాన్స్‌మిషన్ లైన్‌లను మరియు 280 సబ్-స్టేషన్‌లను (15 జనవరి 2025 నాటికి) నిర్వహిస్తోంది మరియు దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో దాదాపు 50% దాని ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ల ద్వారా అందిస్తుంది. POWERGRID దాదాపు 1,00,000 కిలోమీటర్ల టెలికాం నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతదేశం అంతటా 500 నగరాల్లో సుమారు 3000+ ప్రదేశాలలో మరియు ఇంట్రా-సిటీ నెట్‌వర్క్‌లో ఉనికిని కలిగి ఉంది.
మహారత్న స్టేటస్ గల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఎలక్ట్రికల్ విభాగంలో 115 , మేనేజర్, డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. B.TECH లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ లో 60% తో పాటు పని అనుభవం ఉన్నవారికి పే స్కేల్ భాగుంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వార ఎoపిక చేయడం జరగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, వయస్సు, పరీక్ష విధానం, సిలబస్, పరీక్ష ఫీజు మరియు పరీక్షా కేంద్రాల వంటి పూర్తి సమాచారం కోసం మీరు క్రింద చూడవచ్చు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 115 మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
B.TECH/B.E. లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. పని అనుభవం కూడా ఉండాలి.
జీతం :
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు జీతాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
వయస్సు:
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. మరియు రిజర్వేషన్ కలిగి ఉన్న అభ్యర్థులకు age రిలాక్సేషన్ ఉంటుంది. దాని సంబదించి సమాచారం ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. ఉద్యోగ వివరణ ఆధారంగా అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఆన్లైన్ లో అప్లై చేసుకునే వారికీ దరఖాస్తు రుసుము రూ. 500.
SC/ST/PwBD/Ex-SM అభ్యర్థులకు మాత్రమే ఫీజు లో మినహాయింపు ఉంటుంది.
అప్లై చేసేవిధానం:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది ఇవ్వబడిన అప్లికేషను లింక్స్ ద్వారా నోటిఫికేషన్ చదివి , దరఖాస్తు చేసుకోగలరు.
1 thought on “పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో మేనేజర్ ఉద్యోగాలు | Powergrid Manager Jobs Notification 2025 | Udyoga Varadhi”