PLFS Report 2025!
2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) యొక్క ముఖ్యమైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మన దేశంలో తొలిసారిగా నెలవారి నిరుద్యోగ రేటును ప్రభుత్వం వెల్లడించింది. గణాంకాల పథకాలు అమలు శాఖ విడుదల చేసిన తొలి నెలవారి పిరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే ప్రకారం ఏడాది ఏప్రిల్లో 2025 నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదయింది. దేశంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న వ్యక్తుల్లో ఎంత శాతం మంది నిరుద్యోగంతో ఉన్నారో సత్కారం తెలపడమే నివేదిక లక్ష్యం. ఇప్పటిదాకా త్రేమాసికం వార్షిక వారీ గణాంకాలనే ప్రభుత్వం విడుదల చేసేది. తొలిసారిగా నెలవారి నిరుద్యోగ రేటును ప్రభుత్వం వెల్లడించింది.
Join Our Telegram Channel For More Job Updates
నిరుద్యోగ రేటు (Unemployment Rate) :
-
15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో నిరుద్యోగ రేటు 5.1% గా నమోదైంది.
-
పురుషులు: 5.2% | మహిళలు: 5.0%
-
గ్రామీణ ప్రాంతాలు: 4.5% | పట్టణ ప్రాంతాలు: 6.5%
-
యువత (15-29 సంవత్సరాలు): మొత్తం 13.8% | పట్టణ ప్రాంతాల్లో 17.2% | గ్రామీణ ప్రాంతాల్లో 12.3%
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు
కార్మిక శక్తి పాల్గొనడం (Labour Force Participation Rate – LFPR) :
-
మొత్తం: 55.6%
-
పురుషులు: గ్రామీణ ప్రాంతాల్లో 79.0% | పట్టణ ప్రాంతాల్లో 75.3%
-
మహిళలు: గ్రామీణ ప్రాంతాల్లో 38.2% | పట్టణ ప్రాంతాల్లో 25.7%
ఉద్యోగ జనాభా నిష్పత్తి (Worker Population Ratio – WPR) :
-
మొత్తం: 52.8%
-
పురుషులు: గ్రామీణ ప్రాంతాల్లో 70.4% | పట్టణ ప్రాంతాల్లో 65.2%
-
మహిళలు: గ్రామీణ ప్రాంతాల్లో 36.8% | పట్టణ ప్రాంతాల్లో 23.5%
మరిన్ని సమాచారం కోసం :
PLFS Monthly Bulletin April 2025
ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉద్యోగాలు