Udyoga Varadhi

మిధాని హైదరాబాద్‌ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | MIDHANI Notificaiton 2025 | Udyoga Varadhi

MIDHANI Notificaiton 2025:

              మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) 1973లో భారత ప్రభుత్వ సంస్థగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో స్థాపించబడింది. హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్‌లో ఉన్న మిధాని ఉత్పత్తి యూనిట్ 1982లో ప్రారంభించబడింది. వివిధ సూపర్ మిశ్రమలోహాలు, ప్రత్యేక స్టీల్స్, మృదువైన అయస్కాంత మిశ్రమలోహాలు రక్షణ మరియు శక్తి, అంతరిక్షం మరియు ఏరోనాటికల్ అప్లికేషన్‌ల వంటి ఇతర వ్యూహాత్మక రంగాలకు ఉత్పత్తి మరియు సరఫరాలో స్వావలంబన సాధించే లక్ష్యంతో మిధానిని స్థాపించారు. మిధాని ఏర్పాటుకు మార్గదర్శక అంశాలు జాతీయ ప్రాధాన్యతల కిందకు వచ్చే రక్షణ ఆధారిత సాంకేతికతలకు డిమాండ్. మిధాని తయారు చేసే పదార్థాలు ప్రాథమికంగా దిగుమతి ప్రత్యామ్నాయాలు మరియు వాటి లభ్యత లేకపోవడం దేశంలోని వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను ప్రభావితం చేసేది.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

మిశ్ర ధాతు నిగం లిమిటెడ్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్దర్, మెటలర్జీ, మెకానికల్, CAD ఆపరేటర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. దీనికి సంబందించిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలు లాంటివి ముఖ్యమైన విషయాలను కింద ఇవ్వడం జరిగింది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.

MIDHANI Notificaiton 2025

విద్యార్హతలు :

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్దర్, మెటలర్జీ, మెకానికల్, CAD ఆపరేటర్  ఉద్యోగాలకై కావలసిన విద్యార్హతలు కింద ఇవ్వనైనది.SSC/ఫిట్టర్ తో పాటు సంబందిత రంగం లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో Ph.D అడ్మిషన్స్

వయస్సు :

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్దర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి గరిష్టంగా 33 సంవత్సరాలు మించరాదు.
మెటలర్జీ, మెకానికల్ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి గరిష్టంగా 38 సంవత్సరాలు మించరాదు.
CAD ఆపరేటర్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి గరిష్టంగా 35  సంవత్సరాలు మించరాదు.
గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

జీతం :

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్దర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు Rs. 29,920/-
మెటలర్జీ, మెకానికల్, CAD ఆపరేటర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు Rs. 32,770/-

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వివిధ తేదిల్లో ఇంటర్వ్యూ నిర్వహించి Written Exam and Skill Test నిర్వహించి దాని ద్వారా ఎంపిక చేయబడును.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం :
మిధాని కార్పొరేట్ ఆఫీస్,
ఆడిటోరియం,
కంచన్ బాగ్,
హైదరాబాద్,
ఇంటర్వ్యూ కు వచ్చే అభ్యర్థి పైన తెలిపిన తేదిల్లో ఉదయం 8:00 గంటల నుండి 10:30 లోపు attend కావాలి. 10:30 తర్వాత అనుమతి ఉండదు.

కావలసిన ధృవపత్రాలు :

విద్యార్హతలకు సంబందించిన అన్ని Original Certificates తో పాటు 1 set Zerox Copy మరియు 2 PASSPORT SIZE ఫొటోస్:
Experience Certificate
Latest Salary Slips

పోస్టింగ్ :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కాంట్రాక్టు ప్రాతిపదికన ముందుగా 1 సంవత్సరానికి performance బట్టి 3 సంవత్సరాలకు కూడా  పొడిగించవచ్చు

అప్లికేషన్ విధానం:

అధికారిక వెబ్ సైటు లో ఇచ్చిన లింకు ద్వారా పూర్తి వివరలాను ఇచ్చి ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.
ఆన్లైన్ అప్లికేషను లింక్https://erecruit.ap.nic.in/

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ తేదీలు :
ఫిట్టర్ 25.04.2025
ఎలక్ట్రీషియన్ 26.04.2025
టర్నర్ 28.04.2025
వెల్దర్ 28.04.2025
మెటలర్జీ 05.05.2025
మెకానికల్  06.05.2025
CAG ఆపరేటర్ 07.05.2025

ముఖ్య మైన వెబ్ సైటు

అధికారిక వెబ్ సైటు https://midhani-india.in/
అప్లికేషన్ లింకు : https://erecruit.ap.nic.in/
Official Notification

ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ మార్గాలు

Exit mobile version