భారతీయ తపాలా వ్యవస్థ (ఇండియా పోస్ట్) ప్రపంచంలో కెల్లా అతి పెద్ద తపాల వ్యవస్థ. భారతీయ తపాలా ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది భారత ప్రభుత్వంలోని సమాచార మంత్రిత్వ శాఖలో ఒక భాగంగా పని చేస్తుంది. ఇండియా పోస్ట్ తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకుల వలె సర్వీస్లు కూడా అందిస్తుంది. భారతదేశంలో మొదటగా బ్రిటిష్ గవర్నర్ వారెన్ హెస్టింగ్స్ బొంబాయి, మద్రాసు మరియు కలకత్తాలో పట్టణాలల్లో పోస్టాఫీసులు ప్రారంభించారు. ఉద్యోగాలు INDIA POST నుండి GDS (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/డాగ్ సేవక్) ఉద్యోగాల కొరకు దేశవ్యాప్తంగా 21,413 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. భారతీయ తపాలా వ్యవస్థ నుండి తెలంగాణ కు 519 ఉద్యోగాలకై నోటిఫికేషన్లు జారీ చేయడమైనది.
GDS ప్రధాన విధి గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను అందించడం, మెయిల్ డెలివరీ, బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, కస్టమర్ సర్వీస్, గ్రామ పోస్ట్ ఆఫీస్ నిర్వహణలు.
INDIA POST – GDS నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ విధానం మరియు ముఖ్యమైన తేదీలను క్రింద తెలిపిన వివరాల్లో చూడవచ్చును.
GDS: ఏదైనా సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి గుర్తింపు పొందిన విద్యాలయంలో 10వ తరగతి లేదా తత్సమాన కోర్సులో పాస్ తో పాటుగా మరియు కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
పోస్టుల వివరాలు:
భారతీయ తపాలా వ్యవస్థ నుండి తెలంగాణ కు 519 ఉద్యోగాలకై నోటిఫికేషన్లు జారీ చేయడమైనది. అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు.
వయస్సు:
GDSకు కనీస వయస్సు: 18 సంవత్సరాలు. GDS కు గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు.
జీతం:
1. BPM(బ్రాంచ్ పోస్ట్ మాస్టర్): ₹. 12,000/- నుండి 29,380/- 2. ABPM/DS(డాక్ సేవక్): ₹. 10,000/- నుండి 24,470/- తో పాటుగా, TRCA పై డేర్ నెస్ అలవెన్స్, NPA కు సమానమైన పెన్షన్స్ స్కీం కలవు.
2 thoughts on “ఇండియా పోస్ట్ లో (TG) GDS ఉద్యోగాలు | Jobs in India Post 2025 | Udyoga Varadhi”