Udyoga Varadhi

BHEL లో ఇంజనీర్ & సూపర్వైజర్ ట్రైనీస్ ఉద్యోగాలు | Jobs in BHEL 2025 | Udyoga Varadhi

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు!

Jobs in BHEL 2025 – ఈ సంస్థ నుండి వివిధ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీస్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేసింది, ఈ పోస్టులకు సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, పోస్టుల వివరాలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, అప్లికేషన్ కు సంబంధించి ముఖ్య తేదిలను కింది తెలిపిన వివరాలలో చూడవచ్చు.

BHEL భారతదేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ మరియు తయారీ (Manufacturing) సంస్థ, ఇది శక్తి, పరిశ్రమ మరియు మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తుంది. కంపెనీ 1964 సంవత్సరంలో స్థాపించబడింది మరియు అప్పటి నుండి ఇది “మేకింగ్ ఇన్ ఇండియా”గా పనిచేస్తోంది, విద్యుత్ ఉత్పత్తి (థర్మల్, హైడ్రో, గ్యాస్, న్యూక్లియర్ మరియు సోలార్ PV), ట్రాన్స్‌మిషన్, రవాణా, రక్షణ, ఏరోస్పేస్, చమురు మరియు గ్యాస్ మరియు బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలు మరియు ఎలక్ట్రిక్ వాహన ఛార్జర్‌ల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలతో సహా వివిధ రంగాలలో సమగ్ర ఉత్పత్తులు, వ్యవస్థలు మరియు సేవలను అందిస్తోంది. BHEL 16 తయారీ యూనిట్లు మరియు 140+ ప్రాజెక్ట్ సైట్‌లతో (విదేశీాలతో సహా) దేశవ్యాప్తంగా ఉనికిని కలిగి ఉంది.

బిహెచ్ఇఎల్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ & మెటలర్జీ ఇంజనీరింగ్ & యువ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు – విద్యుత్, పరిశ్రమ, ప్రసారం, పునరుత్పాదక శక్తి, రవాణా, శక్తి నిల్వ, రక్షణ & ఏరోస్పేస్, చమురు & గ్యాస్ మరియు నీరు రంగాలలో దేశ నిర్మాణానికి తోడ్పడటానికి – మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ & ఎలక్ట్రానిక్స్ విభాగాలలో యువ మరియు డైనమిక్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు సవాలుతో కూడిన మరియు ప్రతిఫలదాయకమైన కెరీర్‌ను అందిస్తుంది.

పోస్టుల వివరాలు :

ఇంజనీర్ ట్రైనీస్:

Engineer Trainees Vacancies

సూపర్వైజర్ ట్రైనీస్:

విద్యార్హతలు :

ఇంజనీర్ ట్రైనీస్ : Mechanical/Electrical/Civil/Electronics/Chemical/Metallurgy లో B.E/B.Tech or Five-year integrated Master’s degree కలిగి ఉండాలి.
సూపర్వైజర్ ట్రైనీస్ : Mechanical/Electrical/Civil/Electronics లో Diploma in Engineering కలిగి ఉండాలి.
పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన నోటిఫికేషన్ ను చేసుకోగలరు 

జీతం :

ఇంజనీర్ ట్రైనీస్ : Rs 60,000-1,80,000/-
సూపర్వైజర్ ట్రైనీస్ : Rs 33,500-1,20,000/-

వయస్సు :

ఇంజనీర్ ట్రైనీస్ : B.E./B.Tech అభ్యర్థులు 27 సం. రాలు మించకూడదు Post Graduation కలిగిన వారు 29 సం. రాలు మించకూడదు.
సూపర్వైజర్ ట్రైనీస్ : 27 సం. రాలు మించకూడదు
SC/ST వారికి 5 year relaxation
OBC వారికి 3 years relaxation
Relaxation for Persons with Disabilities Candidates
General 10 years
OBC 13 years
SC/ST 15 years

Selection ప్రాసెస్ :

Computer Based Examination ద్వారా 1:3 ratio లో షార్ట్ లిస్టు చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది.
 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవబడిన అభ్యర్థులు Education/Reservatioin కి సంబందించిన అన్ని సర్టిఫికేట్ లను సమర్పించవలెను.

అప్లికేషను ఫీజు :

UR/EWS/OBC అభ్యర్థులకు 1072/-
SC/ST/PWD/Ex-Servicemen అభ్యర్థులకు 472/-

ముఖ్యమైన తేదీలు :

Opening of On-line submission of application : 01.02.2025
Closing of On-line submission of application   : 28.02.2025
Date of Examination                                            : April 11,12 & 13

Official Website

Official Notification

Online Application link

Exit mobile version