IIFCL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (IPL) అనేది ప్రభుత్వ సంస్థ అయిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల సలహా సేవలను అందించడానికి IPL ఫిబ్రవరి 2012లో స్థాపించబడింది. రోడ్లు, రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు (నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల) మరియు ఘన వ్యర్థాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈ సంస్థ సలహా సేవలను అందిస్తుంది. పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ లో మేనేజర్ (గ్రేడ్ B), అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ A) పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 08
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ B.Tech/BE, PGDBM,MBA,CA/CWA,Law, తో పాటు అనుభవం కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్లో వివరించబడింది.
జీతం వివరాలు:
మేనేజర్ (గ్రేడ్ B), అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ A) పోస్టులకు నెలకు జీతం ₹.44,500/- నుంచి ₹.99,750/- పోస్టును బట్టి పే స్కేలు ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
31-03-2025 నాటికీ మేనేజర్ (గ్రేడ్ B), పోస్టుకు వయస్సు 40ఏళ్ళు మరియు అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ A) 30ఏళ్ళు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు, SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.