ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ -Ph.D లో ప్రవేశాలు | IGNTU Ph.D Admissions 2025 | Udyogavaradhi
Udyoga Varadhi
IGNTU Ph.D Admissions 2025:
భారత దేశంలో అత్యున్నత విద్యా సంస్థ అయిన ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ Ph.D లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంట్ ఆక్ట్ ద్వార ఏర్పడిన సెంట్రల్ యూనివర్సిటీ. అత్యున్నత విద్యా డిగ్రీ అయిన Ph.D లోకఠినమైన అధ్యయనం, స్వతంత్ర పరిశోధన మరియు జ్ఞానానికి గణనీయమైన అవకశాల ద్వార తమ యొక్క కెరీర్ ను గ్లోబల్ స్టాయిలో ఉంచడానికి ఈ Ph.D ఉపయోగపడుతుంది.
ఈ Ph.D ద్వార అధునాతన కెరీర్ అవకాశాలకు తలుపులు తెరవడం మరియు ప్రత్యేక నైపుణ్యాలను పొందడం మరియు అర్థవంతమైన ఆవిష్కరణలకు సహకరించడం పేరు ప్రతిష్టలకు మార్గం సుగుమం చేస్తుంది. అటు అకాడమిక్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి మరియు రీసెర్చ్ లో కెరీర్ స్టిరపడటానికి ఎంతుగాను దోహదపడుతుంది.
ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ Ph.D లో వివిధ 35 రకాల సబ్జక్ట్స్ లో 663 సీట్లు ఉన్నాయి. ఈ Ph.D సీట్లు కు సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, స్టిపెండ్, అప్లికేషన్ విధానం, ముఖ్య తేదీలు, అప్లై చేసే విధానం ఇతర ముఖ్యమైన వివరాల కోసం కింద చూసుకోగలరు.
ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ Ph.D లో వివిధ 35 రకాల సబ్జక్ట్స్ లో 663 సీట్లు కై నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.
Ph.D కి మొత్తం ఖాళీ సీట్లు మరియు విభాగాల వారీగా సీట్ మ్యాట్రిక్స్(Main Campus, Amarkantak).
రీజినల్ క్యాoపస్ ఇంఫాల్:
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన నుండి యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ లో 55% తో పాస్ అయి ఉండవలెను.పీహెచ్‌డీ అడ్మిషన్‌కు అర్హత ఖచ్చితంగా UGC (పీహెచ్‌డీ డిగ్రీ ప్రదానం కోసం కనీస ప్రమాణాలు మరియు విధానం) నియంత్రణ, 2022 మరియు IGNTU పీహెచ్‌డీ నియంత్రణ, 2022లకు అనుగుణంగా ఉండాలి.
స్టిపెండ్ :
JRF అభ్యర్థులుకు UGC Norms ప్రకారం RS.30,000 నుంచి RS.50,000 మధ్యలో ఉంటుంది. కానీ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ అఫ్ యూనివర్సిటీ ద్వార పీహెచ్‌డీ లో అడ్మిషన్ పొందిన వారికీ స్టిపెండ్ గురుంచి నోటిఫికేషన్ లో పొందపర్చలేదు.
నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వార యూనివర్సిటీ ఆక్ట్ మెయిన్ క్యాoపస్ Amarkantak మరియు రీజినల్ క్యాoపస్ ఇంఫాల్ లో వ్రాత పరీక్ష 100 మార్కులకు కలదు (OMR-నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్)
50% రీసెర్చ్ ఆప్టిట్యూడ్
50% (35 వివిధ సబ్జక్ట్స్)
Note : ప్రవేశ పరీక్షకు 70.0% వెయిటేజీ మరియు ఇంటర్వ్యూకు 30.0% వెయిటేజీ తో తుది మెరిట్ ద్వార Ph.D లో అడ్మిషన్స్ పొందుతారు.
అప్లికేషన్ ఫీజు:
Online లో దరఖాస్తు చేసుకునే General/OBC/EWS కాటేగిరి అభ్యర్థులు₹. 700/- మరియు SC/ST/PwBD
అభ్యర్థులు ₹. 500/- ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ విధానం:
ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ Ph.D లో వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లై చేసుకువాల. అభ్యర్థి పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫారం ను జాగ్రత్తగా నింపవలెను. అప్లికేషన్ ఫారం లో SSC,ఇంటర్,గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, ఇండస్ట్రియల్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ మరియు ఫోటో లను అప్లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
Ph.D సంబంధించిన ముఖ్యమైన సమాచారం సందర్శించు websites: