IDBI బ్యాంక్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్119 నియామకానికి సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1964 లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడింది. మొదట ఇది పారిశ్రామిక అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించే అభివృద్ధి బ్యాంకుగా ప్రారంభమైంది. 2004 లో ఇది కమర్షియల్ బ్యాంక్‌గా మారింది. IDBI బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా పని చేస్తోంది. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టు లకు అప్లై చేసుకోగలరు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, తదితరాలు పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు:119
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ B.Tech/BE,CA/ICWA,MBA Finance,Law,BCA,B Sc తో పాటు అనుభవం కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్లో వివరించబడింది.
జీతం వివరాలు:
వివిధ పోస్టులకు నెలకు జీతం ₹.1,24,000 నుంచి ₹.1,97,000 పోస్టును బట్టి పే స్కేలు ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
వివిధ పోస్టులకు కనీస వయస్సు 25ఏళ్ళు, గరిష్టంగా 45 ఏళ్ళు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు, SC/ST వారికీ 05 ఏళ్ళు, Ex-Servicemen వారికీ 05 ఏళ్ళు ఉంటుంది.