ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు | ECIL Hyderabad Recruitment 2025 | Udyoga Varadhi

ECIL Hyderabad Recruitment 2025!

          ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌ లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి 2025 కి సంబందించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ కింద ఒక ప్రముఖ షెడ్యూల్-ఎ ప్రభుత్వ రంగ సంస్థ, ఇది వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆవిష్కరణ & స్వదేశీకరణపై దృష్టి పెడుతుంది. ECIL న్యూక్లియర్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం, నెట్‌వర్క్ & హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, CBRN మరియు ఇ-గవర్నెన్స్ వంటి వ్యూహాత్మక రంగాలలో పనిచేస్తుంది. ECIL సాలిడ్ స్టేట్ టెలివిజన్, డిజిటల్ కంప్యూటర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లు, ఎర్త్ స్టేషన్ మరియు డీప్ స్పేస్ నెట్‌వర్క్ యాంటెన్నాలు వంటి అనేక ఉత్పత్తులు చేస్తుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 80 

ECIL Hyderabad Recruitment 2025

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ లో ఇంజినీరింగ్ డిగ్రీ B.Tech (ECE,CSE,EEE,MECH) పాసై ఉండాలి. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.

ECIL Hyderabad Recruitment 2025

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

వయస్సు :

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 27 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

ECIL Hyderabad Recruitment 2025

జీతం :

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.40,000/- నుంచి ₹.1,40,000/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి. 

ఎంపిక విధానం :

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ రాత పరీక్ష Computer Based Test (CBT)  మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షా కేంద్రాలు :

బెంగులూరు,చెన్నై,హైదరాబాద్,ముంబై,న్యూఢిల్లీ,కలకత్తా 

ECIL Hyderabad Recruitment 2025

కావలసిన ధృవపత్రాలు :

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Aadhar/Pan Card

దరఖాస్తు విధానం:

Official Website లో ఆన్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

అప్లికేషను ఫీజు :

  • General/OBC/EWS ₹.1,000/-
  • SC/ ST/ PwBD/Defence Officers/ Regular Employees కు  ఫీజు మినహాయింపు కలదు .

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 05.06.2025

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Official Notification

Online Application link

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

Leave a Comment