​సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | C DOT Technician Notification 2025 | Udyoga Varadhi

​        C DOT Technician Notification 2025!
     ​    సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (C-DOT) వివిధ పోస్టుల భర్తీ కోసం 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. C-DOT భారత ప్రభుత్వానికి టెలికాం భద్రత కోసం సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తుంది. ఈ వ్యవస్థలు నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. భారత టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీల అభివృద్ధి మరియు దేశీయంగా టెలికాం పరికరాల రూపకల్పన, తయారీకి టెక్నీషియన్ ల పాత్ర కీలకంగా ఉంటుంది. టెక్నీషియన్ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టు లకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టు ల వివరాలు :
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (C-DOT) లో టెక్నీషియన్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 29
విద్యార్హతలు :
టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లో  BE/B.Tech (మెకానికల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు

జీతం :
ఈ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,500 నుంచి ₹81,100 జీతం ఉంటుంది.
వయస్సు :
టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసునే అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

కావలసిన పత్రాలు :

  • SSC ,ఇంటర్, డిగ్రీ, సర్టిఫికేట్స్
  • Caste/Pwd సర్టిఫికేట్స్ 
  • ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
నియామక విధానం :
అభ్యర్థులను వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పేపర్ 100 మార్కులకు, మొత్తం 90 నిమిషాల వ్యవధితో ఉంటుంది. వ్రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష & నైపుణ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ (TA) చెల్లించబడదు. 

SYLLABUS FOR WRITTEN EXAM:

పరీక్ష తేదీలు :
టెక్నీషియన్ పోస్టులకు పరీక్ష తేది సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ ద్వారా తెలియజేయబడుతుంది.

పరీక్షా కేంద్రాలు :

Delhi, Bengaluru, Bhopal, Mumbai and Kolkatta

నోట్: రాత పరీక్ష & నైపుణ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ (TA) చెల్లించబడదు. 
అప్లికేషన్ ప్రాసెస్ :
ఆసక్తి గల అభ్యర్థులు ​సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (C-DOT) అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లై చేయుటకు చివరి తేదీ :
05.05.2025
ముఖ్యమైన links :

Official Website

Official Notification

Online Application link

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో ఉద్యోగాలు 2025

Leave a Comment