బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI) అనేది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు. BOI 1906లో స్థాపించబడినది. ఇది 1969లో జాతీయం చేయబడినప్పటి నుండి ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. BOI అనేది SWIFT (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్) వ్యవస్థాపక సభ్యుడు, ఇది ఖర్చు-సమర్థవంతమైన ఆర్థిక ప్రాసెసింగ్ మరియు కమ్యూనికేషన్ సేవలను అందించడానికి వీలు కల్పిస్తుంది. డిసెంబర్ 31, 2024 నాటికి, బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం వ్యాపారం ₹1,446,295 కోట్లు (US$170 బిలియన్లు), ప్రపంచవ్యాప్తంగా 5,202 శాఖలు మరియు 8166 ATMలు & CRMలు (22 విదేశీ శాఖలు సహా) ఉన్నాయి. BOI నుండి చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, లా ఆఫీసర్ మరియు మేనేజర్ స్థాయిలోని వివిధ విభాగాలలో పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అప్లై చేయుటకు కింద ఇచ్చిన సమాచారం చూడగలరు.
వివిధ విభాగాల్లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, లా ఆఫీసర్ మరియు మేనేజర్ స్థాయి పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్టులకు సంబందించి పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పట్టికలో చూడవచ్చు.
విద్యార్హతలు:
BOI ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, వివిధ రకాల పోస్టుల కొరకు, వివిధ రకాల విద్యార్హతలు మరియు ఇతర అర్హతలు కోరుతున్నారు. కావున వాటికి సంభందించిన పూర్తి సమాచారం కొరకు కింద ఉన్న pdf లో చూడగలరు.
ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు compter Based Test ద్వారా వ్రాత పరీక్షను నిర్వహించి మెరిట్ అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది. వ్రాత పరీక్షకు సంబంధించి సిలబస్ ను కింద చూడవచ్చు.
తప్పు సమాధానాలకు జరిమానా:
ఆబ్జెక్టివ్ పరీక్షలలో తప్పు సమాధానాలకు జరిమానా ఉంటుంది. అభ్యర్థి తప్పు సమాధానం ఇచ్చిన ప్రతి ప్రశ్నకు, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో నాలుగో వంతు మార్కులను సరిదిద్దిన స్కోర్‌ను పొందడానికి జరిమానాగా తీసివేయబడుతుంది. ఒక ప్రశ్నను ఖాళీగా ఉంచినట్లయితే, అంటే అభ్యర్థి సమాధానం గుర్తించకపోతే; ఆ ప్రశ్నకు ఎటువంటి జరిమానా ఉండదు.
Computer Based Test లో Qualify అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలువడం జరుగుతుంది. దరఖాస్తుదారులు/అర్హత కలిగిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఆన్లైన్ పరీక్ష మరియు/లేదా వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ పరీక్ష నిర్వహించినట్లయితే, ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ యొక్క వెయిటేజ్ (నిష్పత్తి) 80:20 ఉంటుంది. అభ్యర్థుల మిశ్రమ తుది స్కోర్లను ఆన్లైన్ పరీక్షలో అభ్యర్థులు పొందిన మొత్తం స్కోర్ల ఆధారంగా (జనరల్ అవేర్‌నెస్‌లో పొందిన మార్కులు బ్యాంకింగ్ పరిశ్రమ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పేపర్‌కు ప్రత్యేక సూచన) మరియు ఇంటర్వ్యూ ఆధారంగా లెక్కిస్తారు. తుది ఎంపికకు అర్హత పొందడానికి అభ్యర్థి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ రెండింటిలోనూ తగిన వ్యక్తిగా ఉండాలి.
పరీక్ష ఫీజు:
అప్లికేషన్ ప్రాసెస్ :
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా 23.03.2025 నుండి అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేది : 08.03.2025
అప్లికేషన్ చేయుటకు చివరి తేది : 23.03.2025
వ్రాత పరీక్షా తేది :
పరీక్షకు సంభందించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్ సైటు లో తెలియజేయబడుతుంది. కావున అభ్యర్థులు web site ని అనుసరించగలరు.
4 thoughts on “బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ స్థాయి పోస్టులకి నోటిఫికేషన్ | BOI Manager Level Notification 2025 | Udyoga Varadhi”