భూభారతి చట్టం తెలంగాణ | Bhu Bharati Act 2025 | Udyoga Varadhi

Bhu Bharati Act 2025!

     భూ భారతి చట్టం-2025 తెలంగాణ రాష్ట్రంలో భూముల హక్కుల నిర్వహణను సులభతరం చేయడానికి, భూ వివాదాలను పరిష్కరించడానికి, మరియు రైతుల భూమి హక్కులను రక్షించడానికి రూపొందించబడింది. ఇది ధరణి చట్టాన్ని బదిలీ చేస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు.

Join Our Telegram Channel For More Job Updates

ముఖ్యాంశాలు:

  • భూదార్ సిస్టమ్: ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్) ఇవ్వబడుతుంది, ఇది ఆధార్ కార్డు లాంటిది. ఈ సంఖ్య ద్వారా భూమి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు .

  • భూమి సర్వే మరియు మ్యాపింగ్: భూముల సరిహద్దులు ఖచ్చితంగా కొలిచి, మ్యాప్స్ తయారు చేయడం ద్వారా భూ వివాదాలను నివారించడానికి చర్యలు తీసుకుంటారు .

  • సదా బైనామాలు (అనధికార ఒప్పందాలు): గతంలో ధరణి ద్వారా గుర్తించబడని సదా బైనామాలను ఈ చట్టం ద్వారా గుర్తించి, వాటిపై చర్యలు తీసుకుంటారు .

  • అపీల్స్ వ్యవస్థ: తహసీల్దార్ నిర్ణయాలపై 60 రోజుల్లోగా ఆర్డీవో, ఆర్డీవో నిర్ణయాలపై కలెక్టర్ వద్ద అపీల్స్ చేసుకునే అవకాశం ఉంది .

  • గ్రామస్థాయి అధికారుల నియామకం: ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడం ద్వారా భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు .

  • డిజిటల్ రికార్డులు: భూముల రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడం ద్వారా పారదర్శకతను పెంచుతారు.

Bhu Bharati Act 2025

తెలంగాణలో గ్రామ పాలన అధికారుల నియామకాలు

భూభారతి చట్టంలోని సెక్షన్స్ :

రికార్డుల్లో తప్పుల సవరణ (సెక్షన్ 4 రూల్ 4 అండ్ షెడ్యూల్ ఏ)

  • హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
  • వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ భూమి ట్రిబ్యునల్ లో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు.
  • ధరణి చట్టంలో రికార్డుల సవరణ కోసం నియమం లేదు తప్పుల సవరణకు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందే.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అండ్ మ్యుటేషన్ :

(సెక్షన్ పై రూల్ ఫైవ్ అండ్ షెడ్యూల్ బి)

కొనుగోలు దానం తనహ బదిలీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డుల్లో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ఒకే రోజు జరిగిపోతుంది.

రిజిస్ట్రేషన్ అండ్ మ్యుటేషన్ ప్రక్రియ :

  • స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ అండ్ కొటేషన్ ఫీజు చెల్లింపు.
  • నిర్దేశించిన తేదీనాడు భూభారతి చట్టంలో ఉన్న నమూనాలో కానీ, రిజిస్ట్రేషన్ అండ్ స్థిరాస్తి బదులాయింపు చట్టం ప్రకారం సొంత దస్తావేజు వ్రాసుకుని సమర్పించాలి.
  • దస్తావేజు తో పాటు పట్టాదారు పాసు పుస్తకం, భూమి పటం (ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుండి) సమర్పించాలి.
  • రికార్డులలోని వివరాలతో డాక్యుమెంట్ లోని వివరాలు సరిపోలి, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా భూమి నిషేధిత జాబితాలో లేకుండా ఉండి, పి ఓ టి, ఎల్ టి ఆర్, అమలులో ఉన్న ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉన్నట్లయితే తాసిల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు.
  • వెనువెంటనే భూభారతిలో నమోదు చేసి పాత పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాసు పుస్తకం జారీ చేయడం చేస్తారు. సవరించిన భూభారతి రికార్డును రిజిస్టర్ దస్తావేజుకు జతపరుస్తారు.
  • మ్యుటేషన్ పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి, ఆపై జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు.
  • ధరణి చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ వ్రాసుకోవడానికి అవకాశం లేదు, సర్వే మ్యాప్ లేదు, మ్యుటేషన్ పై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లడం తప్ప ఆపిల్ కు అవకాశం లేదు.

10,956 TG GPO ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ 2025

వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ :

(సెక్షన్ సెవెన్ రూట్ సెవెన్ అండ్ షెడ్యూల్ బి)

వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ చేసి హక్కుల రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో తాసిల్దార్ మ్యుటేషన్ చెయ్యకపోతే డీమ్డ్ మ్యుటేషన్ గా పరిగణిస్తుంది. పాత పాసు పుస్తకం ఉంటే అందులో ఫోన్ చేయడం లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేయడం చేస్తారు.

మ్యుటేషన్ ప్రక్రియ :

  • భూభారతి పోర్టల్ లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు ఎకరానికి 2500 రూపాయల మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి.
  • దరఖాస్తు తో పాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుండి భూమి సర్వే పటం కూడా జత చేయాలి.
  • తాసిల్దార్ 30 రోజులలోగా విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అలా నిర్దేశిత కాలంలో నిర్ణయం తీసుకోకుంటే డీమ్డ్ మ్యుటేషన్ గా పరిగణిస్తుంది.
  • దరఖాస్తుదారునికి పాత పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాసుపుస్తకం జారీ చేయడం చేస్తారు.
  • మ్యుటేషన్ పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి, ఆపై జిల్లా కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చు.
  • ధరణి చట్టం ప్రకారం కొటేషన్ చేసే ముందు విచారణ లేదు. దీనివలన వారసుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి.
ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్ :

(సెక్షన్ 8 రూల్ 8 అండ్ షెడ్యూల్ బి)

  • సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పు, లోక్ అదాలత్ అవార్డు, అసైన్మెంట్ పట్టా, 38 ఈ సర్టిఫికెట్, 13 బి సర్టిఫికెట్, ఓ ఆర్ సి, సేల్ సర్టిఫికెట్ మొదలగు వాటి ద్వారా హక్కుల సంక్రమిస్తే ఆర్డిఓకు దరఖాస్తు తీసుకుంటే హక్కుల రికార్డుల్లో మార్పులు చేసి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేస్తారు.

మ్యుటేషన్ ప్రక్రియ :

  • భూభారతి పోరాటంలో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు హక్కుల నిరూపణకు కావలసిన పత్రాలు జత చేయాలి. ఎకరానికి 2500 రూపాయల మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. సీసీఎల్ఏ నిర్దేశించిన తేదీ నుండి భూమి సర్వే పటం కూడా జత చేయాలి.
  • రెవెన్యూ డివిజనల్ అధికారి విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి.
  • హక్కుల రికార్డులో మార్పులు చేసి దరఖాస్తుదారునికి పాత పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేయడం చేస్తారు.
  • రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్ణయం పై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు ఆపై భూమి ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకోవచ్చు.
  • ధరణి చట్టం ప్రకారం కోర్టు ద్వారా భూమి హక్కులు సంక్రమించినప్పుడు తప్ప మరో విధంగా హక్కుల సంక్రమించిన ముటేషన్ చేసే అవకాశం లేదు.

సాదా బైనామాల క్రమబద్ధీకరణ :

(సెక్షన్ 6 అండ్ రూల్ 6)

2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బహినామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12 అక్టోబర్ 2020 నుండి 10 నవంబర్ 2020 మధ్యకాలంలో క్రమబద్ధీకరణ కోసం సన్నాసిన్న కారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు.

మ్యుటేషన్ ప్రక్రియ :

  • ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుండి రెవెన్యూ డివిజనల్ అధికారులు పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు.
  • స్థానిక విచారణ చేసి చుట్టుప్రక్క రైతులను విచారిస్తారు మౌఖిక రాతపూర్వక ఆధారాలను పరిశీలిస్తారు.
  • పి ఓ టి, సీలింగ్, ఎల్ టి ఆర్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకుంటారు.
  • క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మరియు 100 రూపాయల అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు.
  • హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు.
  • ధరణి చట్టంలో సాదాబై నామాల క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి నియమాన్ని పొందుపరచలేదు. దీనివలన గౌరవ హైకోర్టు సాదా బాయినామాల క్రమబద్ధీకరణ పై స్టే విధించింది.

పట్టాదారు పాస్ పుస్తకాలు :

(సెక్షన్ 10 రూల్ 10 షెడ్యూల్ బి)

  • భూభారతి హక్కుల రికార్డులో నమోదు అయ్యి ఉన్న అందరికీ తనంత తానుగా కానీ భూ యజమాని దరఖాస్తు చేస్తే కానీ రికార్డులు పరిశీలించి 300 రూపాయల ఫీజు వసూలు చేసి పాసుపుస్తకం జారీ చేస్తారు.
  • హక్కుల రికార్డులో ఉన్న వ్యక్తి లైసెన్సుడు సర్వేయర్ తో తన భూమి సర్వే చేయించుకుని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరిచూసినా తరువాత తాసిల్దార్ పాసు పుస్తకంలో సర్వే మ్యాప్ ను ఉంచుతారు.
  • ఎవరైనా పాసు పుస్తకంలోని వివరాలు, హక్కుల రికార్డుతో సరిపోలవడం లేదని దరఖాస్తు చేస్తే తాసిల్దార్ పరిశీలించి సరి చేస్తారు.
  • తాసిల్దార్ నిర్ణయం పై అభ్యంతరాలు ఉంటే రెవిన్యూ డివిజనల్ అధికారికి, ఆపై జిల్లా కలెక్టర్ కు అప్పిలు చేసుకోవచ్చు.
  • ఈ వెసులుబాట్లు ఏవి ధరణి చట్టంలో లేవు.

అప్పీల్ వ్యవస్థ :

(సెక్షన్ 15 రూల్ 14)

  • రెండు అంచెల అప్పిల్ వ్యవస్థ.
  • తహసీల్దారు చేసిన మ్యుటేషన్ పై లేదా తాసిల్దారు జారీచేసిన పాసుపుస్తకాలు లేదా భూధార్ పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీలు చేసుకోవచ్చు. రెవిన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు రెండవ అప్పిలు చేసుకోవచ్చు.
  • రెవిన్యూ డివిజనల్ అధికారి చేసిన కొటేషన్ల పై లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి చేసిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ పై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్ కు రెండవ అప్పీల్ చేసుకోవచ్చు.
  • ధరణి చట్టం కింద ఆపిల్ వ్యవస్థ లేదు కోర్టులను ఆశ్రయించాల్సిందే.

రివిజన్ అధికారాలు :

(సెక్షన్ 16 రూల్ 15)

  • మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ, భూధాన్, అసైన్డ్,ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేయమని ఎవరైనా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు దరఖాస్తు చేయవచ్చు.
  • భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తనంత తానుగా కూడా చర్యలు తీసుకోవచ్చు.
  • ధరణి చట్టంలో ఇలాంటి ఏర్పాటు లేదు.

గ్రామ రెవెన్యూ రికార్డులు :

(సెక్షన్ 13 రూల్ 12)

  • గ్రామ పహాని, ప్రభుత్వ భూముల రిజిస్టర్,మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్ లను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
  • మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ, భూధాన్, అసైన్డ్,ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేయమని ఎవరైనా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు దరఖాస్తు చేయవచ్చు.
  • భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తనంత తానుగా కూడా చర్యలు తీసుకోవచ్చు.
  • ధరణి చట్టంలో ఇలాంటి ఏర్పాటు లేదు.

గ్రామ రెవెన్యూ రికార్డులు :

(సెక్షన్ 13 రూల్ 12)

  • గ్రామ పహాని, ప్రభుత్వ భూముల రిజిస్టర్,మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్ లను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
  • భూమి హక్కుల రికార్డు లోని వివరాలను ఈ రికార్డు లో ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యుటేషన్ జరిగిన ప్రతి సారి ఆన్లైన్ లో గ్రామ లెక్కలలో మార్పులు జరుగుతాయి. 
  • ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఈ గ్రామా రెవిన్యూ రికార్డు లను ప్రింట్ తీసి భద్ర పరుస్తారు.
  • ధరణి వచ్చిన తరువాత గ్రామ రెవిన్యూ రికార్డు ల నిర్వహణ నిలిచిపాయింది. ధరణి చట్టం లో గ్రామ రెవిన్యూ రికార్డు ల గురుంచి ప్రస్తావన లేదు.
రికార్డు ల నకలు పొందడం ఎలా ?
(సెక్షన్ 12 & రూల్ 11 )
  • భూమి హక్కుల రికార్డులు భూ భారతి పోర్టల్ లో అందరికి అందుబాటులో ఉంటాయి.
  • ధరణి చట్టం లో ఎవరైనా తమ రికార్డు లను కనిపించకుండా చేసుకునేల అవకాశం ఉండేది. భూ భారతిలో హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా అందరికి అందుబాటులో ఉంటుంది.
  • ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూ భారతిలో ఉన్న ఫారం లో పది రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చెయ్యాలి. తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీ జారీ చేస్తారు.

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Leave a Comment