BHEL Apprencticeship Notification 2025 :
ఈ సంస్థ నుండి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ విభాగాలలో అప్రెంటిస్ షిప్ కొరకు నోటిఫికేషన్ ను BHEL, తిరుచిరాపల్లి జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, పోస్టుల వివరాలు, అప్లికేషన్ విధానం కు సంబంధించి ముఖ్య తేదీలను కింద తెలిపిన వివరాలు చూడవచ్చు. ముఖ్యంగా BHEL మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ & మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగాలలో డిప్లమా, ఇంజనీరింగ్ హోల్డర్లకు – విద్యుత్, పరిశ్రమ, ప్రసారం, పునరుత్పాదకత శక్తి, రవాణా, శక్తి నిల్వ, రక్షణ, ఏరోస్పేస్, చమురు గ్యాస్ మరియు నీరు రంగాలలో ఉద్యోగ ఉపాధి కల్పనకు తోడ్పడుతుంది.
పోస్టుల వివరాలు :
A) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 125 పోస్టులు

B) టెక్నీషియన్ అప్రెంటిస్: 100 పోస్టులు

C) ట్రేడ్ అప్రెంటిస్: 430 పోస్టులు

విద్యార్హతలు :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
1. Mechanical Engineering: Mech. Engineering లో B.E/B.Tech కోర్స్ చదివిన అభ్యర్థులకు అర్హత కలదు.
2. Civil Engineering: Civil Engineering లో B.E/B.Tech కోర్స్ చదివిన అభ్యర్థులకు అర్హత కలదు.
3. Asstistant-HR: 10+2 పాసై, B.A చదివిన అభ్యర్థులకు మాత్రమే అర్హత కలదు.
టెక్నీషియన్ అప్రెంటిస్:
1. Mechanical Engineering: Mech. Engineering లో Diploma కోర్స్ చదివిన అభ్యర్థులకు అర్హత కలదు.
2. Computer Engineering/I.T: Computer Engineering/I.T లో Diploma కోర్స్ చదివిన అభ్యర్థులకు అర్హత కలదు.
3. Civil Engineering: Civil Engineering లో Diploma కోర్స్ చదివిన అభ్యర్థులకు అర్హత కలదు.
4. Electronics & Communication Engineering: Electronics & Communication Engineering లో Diploma కోర్స్ చదివిన అభ్యర్థులకు అర్హత కలదు.
ట్రేడ్ అప్రెంటిస్:
సంబంధిత ట్రేడ్ కి సంబంధించి SSC పాసై మరియు ITI రెగ్యులర్ ఫుల్ టైం కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే అర్హత కలదు.
స్టైపెండ్:
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు నెలకు ₹. 9,000/- చొప్పున స్టైపెండ్ ఇవ్వబడును.
2) టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు నెలకు ₹. 8,000/- చొప్పున స్టైపెండ్ ఇవ్వబడును.
వయస్సు :
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 18 – 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
* SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు
* OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు
* PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సులో సడలింపు కలదు.
2) టెక్నీషియన్ అప్రెంటిస్: 18 – 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
* SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు
* OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు
* PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సులో సడలింపు కలదు.
3) ట్రేడ్ అప్రెంటిస్: 18 – 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
* SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు
* OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు
* PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సులో సడలింపు కలదు.
ఎంపిక విధానం :
అభ్యర్థులకు సంబంధిత కోర్సులలో వచ్చిన మార్కుల ఆధారంగా మీరు జాబితా రూపొందించి సెలక్షన్ చేయబడుతుంది.
అప్లికేషన్ విధానం:
ఆన్ లైన్ లో మాత్రమే అప్లికేషన్స్ తీసుకోబడును. అప్లై చేయుటకు www.trichy.bhel.comవెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తు ఫారంని పూర్తి చేయవలెను.
ముఖ్యమైన తేదీలు :
Online application opening on: 05-02-2025
Online application closing on: 19-02-2025
1 thought on “BHEL లో 655 అప్రెంటీస్ లు | BHEL Apprencticeship Notification 2025 | Udyoga Varadhi”