UPSC వారు ఈ సంవత్సరం అప్లికేషన్ విధానంలో తీసుకువచ్చిన మార్పులు!
Changes in UPSC 2025 application
విద్యార్హత :
గత సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు మినిమం విద్యార్హతలు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నవారు ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు మాత్రమే అనుమతి ఉండేది., కానీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్ తో పాటు మెయిన్స్ పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. గతంలో మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాలంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ సమర్పించాలి., ప్రస్తుతం ఇంటర్వ్యూకి ముందు నిర్దేశిత గడువులోగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుంది.
రిజర్వేషన్ :
రిజర్వేషన్లు వయోపరిమితి సడలింపులు కోరుతున్న అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్లికేషన్ లోనే అప్లోడ్ చేయవలెను, ఈ నియమం గతంలో జరిగిన ప్రిలిమ్స్ దశలో లేదు.
EWS రిజర్వేషన్ కు సంబంధించిన అభ్యర్థులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో 01-04-20240 నుండి 11-02-2025 ల మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జారీచేసిన ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ ను ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్లికేషన్ దశలోనే అప్లోడ్ చేయాలి.
OBC అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రంతో పాటు, నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్ ను కూడా అప్లోడ్ చేయవలెను. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలకు( అనగా 2021-22, 2022-23 & 2023-24 ) సంబంధించినదై ఉండాలి. OBC సర్టిఫికెట్ 01-04-2024 నుండి 11-02-2025 ల మధ్య జారీ చేసినదై ఉండాలి.
UPSC 2025 Civil Services నోటిఫికేషన్
Detailed Notification of UPSC 2025
పోస్టుల ఎంపిక :
ఈసారి “సర్వీస్ ప్రిఫరెన్స్”లను ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్లికేషన్ దశలోనే ఎంచుకోవలసి ఉంటుంది. అదేవిధంగా “క్యాడర్ ప్రిఫరెన్స్”లను ప్రిలిమ్స్ పరీక్ష అయిన 10 పది రోజుల తర్వాత అప్లోడ్ చేయవలెను.
OTR విధానం :
UPSC బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు OTR అనేది తప్పనిసరి. యూపీఎస్సీ పరీక్షకు మొదటిసారిగా హాజరయ్యేవారు ముందుగా UPSC వెబ్ సైట్ లో OTR రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Edit ఆప్షన్ :
ప్రిలిమినరీ అప్లికేషన్లో సమర్పించిన వివరాలను సవరించాలనుకుంటే 12-28 ఫిబ్రవరి 2025 ల మధ్య సరి చేసుకోవచ్చు.
* అడ్రస్, ఉన్నత విద్యార్హతలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి మెయిన్స్ పరీక్షల తరువాత 15 రోజుల గడువు ఉంటుంది. కావున అభ్యర్థులు ఇప్పుడే జాగ్రత్తగా అప్లికేషన్ అప్లై చేసుకోవడం మంచిది.
Official Website : https://upsc.gov.in/
Thank you for giving valuable information
Thank you so much