తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు | Jobs Opportunities in Japan 2025 | Udyoga Varadhi

Jobs Opportunities in Japan 2025:
     తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్  పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) జపాన్‌కు చెందిన రెండు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ఏప్రిల్ 19, 2025 న టోక్యోలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగాయి. TERN (TGUK Technologies Pvt. Ltd.) మరియు రాజ్ గ్రూప్ అనే రెండు సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇవి రాబోయే  రెండు సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి.
TOMCOM అనేది తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో నడిచే రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ  2015 లో స్థాపించబడింది. తెలంగాణ యువతకు సురక్షితమైన మరియు చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలను అందించడం జరుగుతుంది. TOMCOM ఇప్పటికే జపాన్, జర్మనీ, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలలో వేలాది మంది అభ్యర్థులను ఉద్యోగాలలో నియమించింది. 

Join Our Telegram Channel For More Job Updates

ఒప్పంద వివరాలు :
TERN గ్రూప్ టోక్యోలోని షినాగావా ప్రాంతంలో కార్యాలయం కలిగి, సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, మరియు స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్ (SSW) విభాగాలలో అంతర్జాతీయ నియామకాలలో నైపుణ్యం కలిగిన సంస్థ. రాజ్ గ్రూప్ జపాన్‌లో ప్రముఖ నర్సింగ్ కేర్ యజమాని అయిన Tsukui Corporationతో భాగస్వామ్యంతో, TOMCOMతో కేర్‌ గివర్ల శిక్షణ మరియు నియామకంలో ఇప్పటికే పనిచేస్తోంది. ఈ కొత్త ఒప్పందంతో ఆరోగ్యేతర రంగాలకు కూడా విస్తరిస్తుంది. ఈ ఒప్పందాలు తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలను అందించడంలో కీలకమైన ముందడుగుగా భావించబడుతున్నాయి, వారి నైపుణ్యాలను జపాన్ యొక్క అభివృద్ధి చెందుతున్న శ్రమ మార్కెట్‌లో ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తాయి.
ఉద్యోగ అవకాశాల వివరాలు:
రాబోయే 1-2 సంవత్సరాలలో ఈ కంపెనీలు కలిపి 500 ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి. ఆరోగ్య రంగంలో 200 ఉద్యోగాలు (నర్సింగ్ కేర్, కేర్‌గివర్ పాత్రలు). ఇంజనీరింగ్ లో  100 ఉద్యోగాలు (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ), హాస్పిటాలిటీలో  100 ఉద్యోగాలు (హోటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ అండ్ బెవరేజ్), నిర్మాణం రంగంలో 100 ఉద్యోగాలు (సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ వర్క్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఎక్విప్‌మెంట్ హ్యాండ్లింగ్ etc…

అర్హత:
ఇంజనీరింగ్ ఉద్యోగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లేదా సెమీకండక్టర్ రంగంలో గ్రాడ్యుయేట్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.
నర్సింగ్ ఉద్యోగాలు: B.Sc నర్సింగ్, GNM లేదా ANM డిప్లొమా కలిగి, కనీసం 1 సంవత్సరం క్లినికల్ అనుభవం ఉన్నవారు.
హాస్పిటాలిటీ ఉద్యోగాలు: హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగిఉండాలి.

తెలంగాణలో గ్రామ పాలన అధికారుల నియామకాలు

వయస్సు :
ఇంజనీరింగ్,హాస్పిటాలిటీ ఉద్యోగాలకు 22-30 సంవత్సరాల మధ్య వయస్సు, హాస్పిటాలిటీ ఉద్యోగాలకు 22-27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
జీతం:
ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ, నర్సింగ్ ఉద్యోగాలకు నెలకు రూ. 1.5 లక్షల నుండి రూ. 1.8 లక్షల వరకు ఉంటుంది. 
ఎంపిక:
ఎంపికైన వారికి హైదరాబాద్‌లో జపనీస్ భాషా శిక్షణ మరియు అదనపు నైపుణ్యాల శిక్షణ ఇవ్వబడుతుంది. ఇది జపాన్‌లో విజయవంతమైన ఉద్యోగ నియామకానికి సహాయపడుతుంది.
దరఖాస్తు విధానం :
ఆసక్తి ఉన్న అభ్యర్థులు TOMCOM అధికారిక వెబ్‌సైట్ Official Website ను సందర్శించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం, రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com కు పంపించాలి. 
మరిన్ని సమాచారం కోసం :
Official Website
కార్యాలయ చిరునామా:
TOMCOM( Telangana Overseas Manpower Company Ltd)
ITI మల్లేపల్లి క్యాంపస్,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్-500057.
Tel:+91-040-2334-2040 లేదా (+91) 040-2334 2040 ను సంప్రదించవచ్చు.

తెలంగాణలో కొలువుల జాతర

Leave a Comment