UOH Ph.D Admissions 2025:
యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ నిర్వహించే PhD 2025 సంవత్సరానికి ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నది. UOH అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి పూర్తి నిధులతో, పార్లమెంటు చట్టం ద్వారా అక్టోబర్ 2, 1974న కేంద్ర విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఈ యూనివర్సిటీ లో పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీలు, యితర కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ Ph.D సీట్లు కు సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, స్టిపెండ్, అప్లికేషన్ విధానం, ముఖ్య తేదీలు, అప్లై చేసే విధానం ఇతర ముఖ్యమైన వివరాల కోసం కింద చూసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
Ph.D సీట్లువివరాలు:
యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ Ph.D లో వివిధ 22 & 19 రకాల సబ్జక్ట్స్ లో 372 సీట్లు కై నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.
Ph.D కి మొత్తం ఖాళీ సీట్లు మరియు విభాగాల వారీగా సీట్ మ్యాట్రిక్స్ ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన నుండి యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ లో 55% తో పాస్ అయి ఉండవలెను. పీహెచ్‌డీ అడ్మిషన్‌కు అర్హత ఖచ్చితంగా UGC (పీహెచ్‌డీ డిగ్రీ ప్రదానం కోసం కనీస ప్రమాణాలు మరియు విధానం) నియంత్రణ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు అనుగుణంగా ఉండాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ కంట్రోల్ బోర్డ్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు
స్టైపెండ్ :
JRF అభ్యర్థులుకు UGC Norms ప్రకారం RS.30,000 నుంచి RS.50,000 మధ్యలో ఉంటుంది. కానీ అల్ ఇండియా ఎంట్రన్స్ పరీక్షా ద్వారా పీహెచ్‌డీ లో అడ్మిషన్ పొందిన వారికీ స్టిపెండ్ అనేది యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ పార్లమెంటు చట్టం అనుసరించి నోటిఫికేషన్ లో చూడగలరు.
వయస్సు :
గరిష్ట వయస్సు కు సంబదించి ఎటువంటి నిబందన లేదు. కాని JRF కి 32 ఏళ్ళు ఉండాలి. రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి SC/ST కి 5 ఏళ్ళు,OBC కి 03 ఏళ్ళు ఉంటుంది.
ఎంపిక విధానం:
యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ Ph.D లో 22 రకాల సబ్జక్ట్స్ లో 188 సీట్లు, అల్ ఇండియా ఎంట్రన్స్ పరీక్షా ద్వారా, 19 రకాల సబ్జక్ట్స్ లో 184 సీట్లు, UGCNET/CSIR-UGCNET ద్వారా భర్తీ చేయబడతాయి. PhD కోర్సుల కోసం అర్హత మరియు రిసెర్చ్ ప్రపోజల్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
Note : ప్రవేశ పరీక్షకు 70.0% వెయిటేజీ మరియు ఇంటర్వ్యూకు 30.0% వెయిటేజీ తో తుది మెరిట్ ద్వార Ph.D లో అడ్మిషన్స్ పొందుతారు.
అప్లికేషన్ ఫీజు:
Online లో దరఖాస్తు చేసుకునే General కాటేగిరి అభ్యర్థులు ₹. 600/- మరియు OBC-NCL కాటేగిరి అభ్యర్థులు ₹. 400/-, EWS కాటేగిరి అభ్యర్థులు ₹. 550/- SC/ST/PWD(PH) అభ్యర్థులు ₹. 275/- ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ విధానం:
యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ Ph.D లో వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లై చేసుకువాలి.అభ్యర్థి పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫారం ను జాగ్రత్తగా నింపవలెను. అప్లికేషన్ ఫారం లో SSC,ఇంటర్,గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, ఇండస్ట్రియల్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ మరియు ఫోటో లను అప్లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషను చివరి తేది : 30.04.2025
మరిన్ని సమాచారం కోసం :
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు