CSIR జాతీయ భౌతిక పరిశోధన సంస్థ (NGRI), హైదరాబాద్‌లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. CSIR జాతీయ భౌతిక పరిశోధన సంస్థ భారతదేశంలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థగా గుర్తించబడింది. ఈ సంస్థ ప్రధానంగా భౌతిక శాస్త్రాలు, భూకంప శాస్త్రం, భూమి శాస్త్రం, వాయువ్య శాస్త్రం, మరియు సముద్రంలో ఖనిజ సంపద, వాయుగోళ శాస్త్రాల పై సాంకేతిక పరిశోధనలు, భూకంపాల విశ్లేషణ, నివారణ, జియోటెక్నికల్ పరికరాల అభివృద్ధి చేస్తుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టు లకు అప్లై చేసుకోగలరు.
CSIR జాతీయ భౌతిక పరిశోధన సంస్థ (NGRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 11
విద్యార్హతలు:
పోస్టును అనుసరిoచి 12వ తరగతి (10+2) లేదా సమానమైన ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు నోటిఫికేషన్‌లో వివరించబడింది.
జీతం వివరాలు:
నెలకు జీతం ₹.38,483/- పే స్కేలు తో పాటు DA,HRA,TA ఇవ్వడం జరుగుతుంది.
కనీస వయస్సు 28ఏళ్ళు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు, SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.
కావలసిన పత్రాలు :
SSC ,ఇంటర్ సర్టిఫికేట్స్
Caste/Pwd సర్టిఫికేట్స్
ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
ఎంపిక విధానం:
OMR ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ బహుళైచ్ఛిక పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జిమెంట్ మొదలైన అంశాలను ఆదారంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ రూపొందించబడుతుంది. రాత పరీక్ష/ టైపింగ్ పరీక్షకు ఎటువంటి TA తిరిగి చెల్లించబడదు. సిలబస్ కు సంబందించి సమాచారం ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
ఫీజు వివరాలు:
GENERAL, EWS & OBC ,SC/ST/PWDB/ Women అభ్యర్థులు ₹. 500/-దరఖాస్తు రుసుము చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు CSIR జాతీయ భౌతిక పరిశోధన సంస్థ (NGRI) అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.