TG GPO Notification 2025!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 10,956 గ్రామ పరిపాలన అధికారుల పోస్టులను నోటిఫై చేయడం జరిగింది.
ఈ గ్రామ పరిపాలన అధికారులను నియమించడానికి గల కారణాలు..!
Notification ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది….!
ఈ Notification కి సంబందించిన Syllabus….!
Cut Off marks ఎంత ఉండే అవకాశం….!
ఇంతకు ముందు లేని ఈ గ్రామ పరిపాలన అధికారులు అనే కొత్త పోస్టు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ?
గతంలో గ్రామ స్థాయిలో ఒక VRO (Village Revenue Officer) మరియు VRA (Village Revenue Assistant) అనే ఉద్యోగులు ఉండి గ్రామానికి సంబందించిన భూ రికార్డులను, పన్నులు, వివిధ ఆధాయలను సేకరించడం మరియు గ్రామానికి సంబందించిన ఇతర వ్యవరహారాలను చూసే వారు. ప్రతి గ్రామానికి ఒక VRO & VRA ఉండే వారు. వీరే గ్రామ స్థాయి పరిపాలనలో, పై అధికారులకు సహాయకారిగా ఉంటూ పాలనలో సౌలభ్యాన్ని అందించేవారు.
Village Revenue Officers/ గ్రామ పరిపాలన అధికారులు నిర్వహించే విధులు :
రికార్డులను నిర్వహించడం : గ్రామంలోని భూములు లేదా ఆస్తులకు సంబందించిన ఖచ్చితమైన రికార్డులను Maintain చేయడం.
ఆధాయ సేకరణ : గ్రామస్తులు చెల్లించాల్సిన పన్నులు (వ్యవసాయ పన్నులు, ఆస్తి పన్నులు) లేదా ఇతర రుసుములను (మార్కెట్ పన్నులు) సకాలంలో సేకరించడం.
నియంత్రణ అమలు : గ్రామస్థులు స్థానిక చట్టాలు లేదా శాసనాలు, జోనల్ చట్టాలు, వ్యవసాయ చట్టాలు మరియు ఆస్తి నిబంధనలతో సహా పాటించేలా చూసుకోవడం.
వివాద పరిష్కారం: భూమి యాజమాన్యం, వారసత్వం లేదా పన్ను సమస్యలకు సంబంధించిన వివాదాలను నిర్వహించడం.
పర్యవేక్షణ : సేకరించిన ఆదాయం సరిగ్గా నమోదు చేయబడినదా? లేదా? మరియు స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోబడుతున్నాయో? లేదో? నిర్ధారించుకోవడం.
ఉన్నత అధికారులతో సమన్వయం : గ్రామం లేదా గ్రామ పరిధి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు అందించడం మరియు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పథకాల విధానాలు లేదా నియమ నిబంధనలను అమలు చేయడం.
అయితే గ్రామ స్థాయిలో ఇన్ని రకాల విధులను నిర్వహిస్తూ సులభ పాలనలో తమ సేవలను అందిస్తున్న VRO & VRA ల మొత్తం వ్యవస్థను గతంలో రద్దు చేసి, వారిని వేరే డిపార్ట్మెంట్ లలో జూనియర్ అసిస్టెంట్ లుగా సర్దుబాటు చేయడం జరిగింది.
దీని వలన గ్రామ స్థాయి పాలనలో అటూ ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది. Field level లో ఆధాయ సమీకరణలలో జాప్యం, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో విఫలమవడం, అసలైన అర్హులను గుర్తించలేకపోవడం, ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడుకోకపోవడం లాంటి ఇబ్బందులను ఎదురుకోవడం జరుగుతుంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ గ్రామ స్థాయిలో అలాంటి సేవలను తిరిగి పొందే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం “గ్రామ పరిపాలన అధికారులను(GPO)” నియమించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తమ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం గ్రామ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడం కోసం 10,956 ఉద్యోగులు అవసరమని నిర్దారించడం జరిగింది.
ఈ 10,956 గ్రామ పరిపాలన అధికారులను నియమించడం కోసం గతం లో పనిచేసిన VRO & VRA లలో ఈ పోస్టుకు కావలసిన అర్హతను బట్టి వారి నుంచి Willing ను కోరడం జరిగింది. దానికి గాను దాదాపు 6000 మంది ఉద్యోగులు ఈ గ్రామ పరిపాలన అధికారిగా(GPO) పనిచేయుటకు సుముఖంగా ఉన్నట్టు తెలపడం జరిగింది.
మిగతా వారిని దాదాపు 5000 గ్రామ పరిపాలన అధికారులను Direct Recruitment ద్వారా నే నియమించడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. దానికి గాను April, 2025 నెలలో GPO Notification వచ్చే అవకాశం ఉంది.
ఇంత భారీ నోటిఫికేషన్ వచ్చే ఆవకాశం ఉన్నందు వల్ల నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కి సంబందించిన syllabus పై focus చేసి జాబ్ కొట్టే అవకాశాన్ని వదులుకోకూడదు అని మేము కోరుకుంటున్నాము.
Key Factors about this Upcoming GPO Notification!
-
గత పది సంవత్సరాలలో కేవలం 2 సార్లు మాత్రమే notification ఇచ్చి, ఉద్యోగులను నియమించడం జరిగింది.
-
ఉమ్మడి Andhra Pradesh రాష్ట్రం 2013 లో ఒకసారి, Telangana ఏర్పడిన తరువాత 2018 లో ఒకసారి notification రావడం జరిగింది.
-
ఈ 2 notifications లో కూడా కేవలం Intermediate విద్య అర్హతగా ఇవ్వడం జరిగింది.
-
కానీ ఈ సారి Degree అర్హతగా ఇవ్వవచ్చని ఒక అంచనా.
-
Examination లో అడిగే ప్రశ్నల సరళిని ప్రతిసారి కఠినతరం చేయడం జరుగుతుంది.
-
కాబట్టి Previous Examination ని ఆధారం చేసుకొని Cut Off ఎంత ఉండవచ్చని మనం ఒక అవగాహనకు రాలేము.
-
2014 నుంచి 2025 వరకు నిరుద్యోగుల సంఖ్య కూడా బాగా పెరిగింది అనడంలో కూడా సందేహం లేదు. కాబట్టి Apply చేసుకున్న Applicants మరియు ప్రశ్నల సరళిని బట్టి మాత్రమే Exam జరిగిన తరువాతనే Cut Off Marks పై ఒక అవగాహనకు రావచ్చు.
-
ఈ మధ్య జరిగిన(2018 లో) TSPSC Examinations ను బట్టి చూస్తే VRO EXAM 150 మార్కులకు ఉండడం జరిగింది, ప్రశ్నపత్రాల సరళిని బట్టి అన్నీ కేటగిరి ల వారికి కూడా Cut Off Marks 100 – 120 మధ్యలో ఉండవచ్చు. కొన్ని జిల్లాల్లో ఈ Cut Off Marks అనేవి ఎక్కువగా కూడా ఉండవచ్చు లేదా తక్కువగా కూడా ఉండవచ్చు.
Syllabus:
సిలబస్ పరంగా చూస్తే 2013 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని నోటిఫికేషన్ కి 2018 తెలంగాణ నోటిఫికేషన్ కి మార్పులయితే చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2013 నోటిఫికేషన్లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక 2018 నోటిఫికేషన్ లో VRO కీ ఒకే PAPER తో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సారి కూడా ఒకే పేపర్ ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. ఒకవేళ డిగ్రీ Qualification తో 2 papers కూడా పెట్టవచ్చు దీనికోసం official notification వచ్చే వరకు ఆగవలసిందే.
అయితే 2018 లో జరిగిన VRO Exam కి ఇప్పుడు జరుగబోయే GPO Exam కి ప్రశ్నల సరళిలో చాలా తేడా ఉండవచ్చని భావించవచ్చు. VRO exam అనే కాదు ఇంతకు ముందు జరిగిన పరీక్షలను పరిశీలిస్తే ప్రశ్నల కఠినతరాన్ని పెంచడం మనం గమనించవచ్చు. ఇంతకుముందు simple గా 1 లైన్ questions ఉండేవి కానీ ఇప్పుడు జరిగిన exams ను చూస్తే 1 లైన్ questions కాకుండా statements అండ్ assumptions రూపంలో అడగడం జరుగుతుంది. So మనం ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని next exam కి ఎంత భాగా సన్నద్ధం అయితే జాబ్ సాధించే అవకాశం అంతా పెరగవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో? రాదో? కూడా మనం చెప్పలేము, అందుకే సమయాన్ని వృధా చేయకుండా ఇప్పటినుంచే preparation ను start చేయడం బెట్టర్.
తెలంగాణ రాష్ట్రం 2018 నోటిఫికేషన్ లోని సిలబస్:
Cut Off మార్కులు ?
Cut off మార్కుల విషయానికి వస్తే మనం ఇప్పుడే ఒక అంచనా వేయలేము, ఎందుకంటే దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి.
-
ప్రతి నోటిఫికేషన్ కి aspirants పెరగడం.
-
Old Aspirants కి సిలబస్ పై పట్టు పెరగడం.
-
ప్రతి exams లో ప్రశ్నలు అడిగే సరళిలో మార్పులు ఉండడం.
-
Cut off విషయం లో జిల్లా వారీగా కూడా తేడాలు ఉండడం.
పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే cut off విషయంలో మనం ఒక అవగాహనకు రాలేము.
So, నిరుద్యోగ స్నేహితులకు చెప్పేది ఏంటంటే, మీరు cut off మార్కుల గురించి ఆలోచించడం మానేసి, మీ యొక్క preparation పై దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం మంచిది. ఇప్పుడు ఉన్న competition ను చూస్తే కేవలం 0.01 మార్కులతో కూడా job రాలేని పరిస్థితిని కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఏది ఏమైనా జాబ్ కోడతాం, అనే సంకల్పం తో ముందుకు వెళితేనే, జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2018 తెలంగాణా VRO నోటిఫికేషన్
2018 తెలంగాణా VRO Question Paper
Official Website
ప్రశ్నల సరళి లో మార్పులను కింద చూడవచ్చు.
2014 VRO Exam sample questions
2018 VRO Exam sample questions
ఎలా ప్రిపేర్ కావాలి ?
-
మీరు ఏ Exam కి ప్రిపేర్ అయిన కూడా ముందుగా, అసలు ఆ Exam యొక్క పూర్తి syllabus ఏమిటి? అనే విషయం పై మీకు మంచి అవగాహన కలిగి ఉండాలి.
-
First syllabus పై పూర్తి పట్టు వచ్చిన తర్వాత content wise గా మీకు అనుకూలంగా టైమ్ టేబుల్ ని ready చేస్కోవాలి. టైమ్ టేబుల్ లేకుండా సిలబస్ ని పూర్తి చేయడం అనేది కష్టం.
-
VRO Exam కి అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ current affairs అంశాల పై ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి రోజు ఏదేని 2 న్యూస్ పేపర్లని క్రమం తప్పకుండా చదవడం మంచిది. దీని తో పాటు current affairs అంశాల పై మార్కెట్ లో magazines కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా follow అవ్వడం మంచిది.
-
మనం ఏది చదివిన కూడా వెంటనే notes prepare చేసుకోవడం తప్పనిసరీ, కొంత మంది కేవలం చదవడం పైనే దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇలా చదువుకుంటూ పోతే చివరి రోజుల్లో revision చేయడం కోసం మళ్ళీ మొత్తం చదవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు first చదివేటప్పుడె ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవడం బెట్టర్.
-
Content కి సంబందించిన పుస్తకాలను ఏది పడితే అది చదవకుండా మంచి ప్రామాణికమైన పుస్తకాలనే తీసుకోవాలి. Content పై మంచి పట్టు గల రచయితల పుస్తకాలనే తీసుకోవాలి.
-
ఎలాంటి పుస్తకాలను చదవాలి? ఎవరి పుస్తకాలను తీసుకోవాలి? అనే దాని కోసం ఇంతకు ముందు success అయిన వారి సలహాలను, సూచనలను తీసుకోవడం బెటర్.
-
Youtube లాంటి social media మధ్యమాల్లో ప్రతి సిలబస్ సంబందించిన సమాచారం అందుబాటులో ఉంది. అలా అని వాటిని నమ్మి follow అవ్వడం కూడా అంతా మంచిది కాదు.
-
Job preparation కన్నా ముందు మంచి పుస్తకాలను ఎంచుకున్నపుడే మొదటి విజయం సాదించినట్టు.
-
మీకు ఇబ్బంది అనిపించే content కి ఎక్కువ టైమ్ ఇస్తూ మీకు easy అనిపించే వాటికి తక్కువ టైమ్ కేటాయిస్తూ తమ time table ని ప్రిపేర్ చేస్కోవాలి.
Content wise ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పుస్తకాలను కింద ఇవ్వడం జరిగింది, ఇది కేవలం మీకు ఒక అవగాహన రావడానికి మాత్రమే (ఎవరి పబ్లికేషన్స్ కూడా మేము చదువమని ప్రోత్సహించడం లేదు).
-
ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ current affiares:
- డైలీ న్యూస్ పేపర్,
- Monthly magazines.
-
జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మరియు disaster management:
- తెలుగు అకాడమీ బుక్స్
- SCERT పుస్తకాలు
- ప్రసన్న హరికృష్ణ-Winners Publication Book
3. తెలంగాణ, ఇండియా జియోగ్రఫీ:
- తెలుగు అకాడమీ బుక్స్
- A.D.V రమణ రాజు
- మజీద్ హుస్సైన్ బుక్
- Oxford World Atlas
-
తెలంగాణ మరియు ఇండియన్ ఎకానమీ:
-
సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2025
-
ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26
-
తెలంగాణ & ఇండియన్ బడ్జెట్ 2025-26
-
తెలుగు అకాడమీ బుక్స్
-
Indian Constitution:
- తెలుగు అకాడమీ బుక్స్- భారత రాజ్యాంగం
- లక్ష్మీకాంత్
- Modern Indian History Focus on “Indian National Movement”
- తెలుగు అకాడమీ బుక్స్ – B.A Books
- ఇ. శీనయ్య
6. History of telangana & Telangana Movement
- తెలుగు అకాడమీ బుక్స్
- వి. ప్రకాష్ బుక్స్
- PNR Publications
7. Society, Culture, Heritage, Arts & Literature of Telangana
- తెలుగు అకాడమీ బుక్స్
- వి. ప్రకాష్ బుక్స్
- PVR Publications
8. Policies of Telangana:
- సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2025
- Monthly Magazine Books
- Basic English:
- Paramount Publication
- Arihant Publication
9. Mental Ability, Logical Reasoning, Numerical & Arithmetic Abilities:
-
RS Aggarwal
-
Rakesh Yadav
పైన తెలిపిన పుస్తకాలతో పాటుగా మీకు తెలిసిన ఇతర పుస్తకాలపైన అవగాహన ఉంటే, వాటిని కూడా follow అవ్వడం మంచిది.
Excellent information keep it up
Good Information for Aspirants