ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) 2025 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నియామక ప్రకటనలను విడుదల చేసింది. ఐఆర్ఈఎల్ (ఇండియా) లిమిటెడ్ (IREL – Indian Rare Earths Limited) 1950లో భారత ప్రభుత్వ పరమాణు ఇంధన శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది. దీనిని ప్రాథమికంగా భూమి ఖనిజాలు మరియు పదార్థాల అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్ కోసం ప్రారంభించారు. IREL భారతదేశంలోని మున్సిపల్ (కేరళ), చవరా (కేరళ), ఒడిశా, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్యాచరణను కలిగి ఉంది. సంస్థ ఇల్మనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, సిల్లిమనైట్, గార్నెట్ వంటి ఖనిజాలను ప్రాసెస్ చేస్తుంది. IREL తన ఆర్థిక సామర్థ్యం, నిరంతర లాభదాయకత, మరియు స్వతంత్ర కార్యకలాపాల కారణంగా “మినిరత్న కేటగిరీ-1” హోదాను పొందింది. ఇది దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌కు కూడా దుర్లభ భూమి ఖనిజాలను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజా పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీలను అమలు చేసి, ఖనిజ ప్రాసెసింగ్‌ను మెరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, జీతం, అప్లికేషన్ విధానం వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.
IREL వివిధ విభాగల్లో ఫైనాన్స్-06, HRM-06, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్-03, సివిల్-05, టెక్నికల్-10, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, తదితరాలు పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 30
విద్యార్హతలు :
పోస్టును అనుసరిoచి సంబందిత విభాగంలో B.Tech/M.Tech, B.Sc, MBA,CA/CMA, B.COM, M.A.,P.G.,లలో విద్యార్హతను పాటు అనుభవం కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్‌లో వివరించబడింది.
జీతం:
జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, తదితరాలుపోస్టుల ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి నెలకు ₹.40,000 నుంచి ₹.2,40,000 పోస్టును బట్టి పే స్కేలు తో జీతం ఇవ్వడం జరుగుతుంది, జీతం తో పాటు అన్నీ రకాల allowance కూడా లభించడం జరుగుతుంది.
వయస్సు :
జనరల్ మేనేజర్ పోస్టుకు 50 సంవత్సరాలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 46 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్ పోస్టుకు 42 సంవత్సరాలు,సీనియర్ మేనేజర్ పోస్టుకు 38 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 28 సంవత్సరాలు, మేనేజర్ పోస్టుకు 35 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 32 సంవత్సరాలు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ OBC వారికీ 03 ఏళ్ళు,SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.
1 thought on “ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ లో మేనేజేరియల్ ఉద్యోగాలు | IREL Executives Recruitment 2025 | Udyoga Varadhi”