హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అనేది భారత ప్రభుత్వ సంస్థ, ఇది అణు శక్తి విభాగం కింద ఏప్రిల్ 11, 1967న డాక్టర్ ఎ. ఎస్. రావు ద్వారా హైదరాబాద్‌లో స్థాపించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ECIL ఒక బహుళ-ఉత్పత్తి, బహుళ-విభాగ సంస్థగా పనిచేస్తుంది, ఇది స్వదేశీ అణు శక్తి, అంతరిక్షం, రక్షణ రంగాలపై దృష్టి సారిస్తుంది. ECIL సంస్థ తొలి స్వదేశీ డిజిటల్ కంప్యూటర్లు (TDC 312 మరియు TDC 316), సాలిడ్ స్టేట్ టీవీ, అణు విద్యుత్ కేంద్రాల కోసం నియంత్రణ వ్యవస్థలు, మరియు భారతదేశంలో మొట్టమొదటి ఎర్త్ స్టేషన్ యాంటెన్నా వంటి వాటిని రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. ఇది ఎలక్ట్రానిక్ భద్రత, కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్, మరియు ఈ-గవర్నెన్స్ రంగాలలో కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. ECIL ఉన్న ప్రాంతం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆధునిక మరియు అభివృద్ధి చెందుతున్న నివాస స్థలంగా పరిగణించబడుతుంది. అధికారిక నోటిఫికేషన్‌లో అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం మరియు ఇతర ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, జీతం, అప్లికేషన్ విధానం వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.
హైదరాబాద్‌లోని ECIL విభాగంలో ప్రాజెక్ట్ ఇంజినీర్,అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
విద్యార్హతలు :
పోస్టును అనుసరిoచి సంబందిత విభాగంలో B.Tech, డిప్లొమా లలోవిద్యార్హతను కలిగి ఉండాలి.
జీతం:
ప్రాజెక్ట్ ఇంజినీర్,అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి నెలకు ₹25,000 నుంచి ₹55,000 పోస్టును బట్టి పే స్కేలు తో జీతం ఇవ్వడం జరుగుతుంది, జీతం తో పాటు అన్నీ రకాల allowance కూడా లభించడం జరుగుతుంది.
వయస్సు :
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు వయస్సు 33 ఏళ్ళు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు వయస్సు 30 ఏళ్ళు, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు వయస్సు 30 ఏళ్ళు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ జనరల్/OBC వారికీ 3 ఏళ్ళు,SC/ST వారికీ 05 ఏళ్ళు, PwBD వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.
ప్రాజెక్ట్ ఇంజినీర్,అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ 26/03/2025 న కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, TIFR రోడ్, ECIL పోస్ట్, హైదరాబాద్ 500062 లో జరుగును.
కావలసిన పత్రాలు :
SSC ,ఇంటర్, డిగ్రీ, సర్టిఫికేట్స్
అనుభవం సర్టిఫికేట్
Caste/Pwd సర్టిఫికేట్స్
ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
2 thoughts on “ECIL హైదరాబాద్ లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు | ECIL Hyderabad Notification 2025 | Udyoga Varadhi”