IIFCO లో అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీస్ ఉద్యోగాలు| IFFCO Recruitment 2025 | Udyoga Varadhi

IFFCO Recruitment 2025!

           ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, లేదా IFFCO అనేది బహుళ-రాష్ట్ర సహకార సంఘం, ఈ సంస్థ ఎరువుల ఉత్పత్తి మరియు పంపిణీలో పాల్గొంటుంది. భారతదేశంలోని న్యూఢిల్లీ IFFCO కి ప్రధాన స్థావరంగా పనిచేస్తుంది. 1967లో 57 సభ్యుల సహకార సంఘాలతో స్థాపించబడిన ఇది, ప్రస్తుతం తలసరి GDP టర్నోవర్ పరంగా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సహకార సంస్థ (వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2021 ప్రకారం) , దాదాపు 35,000 సభ్యుల సహకార సంఘాలు 50 మిలియన్లకు పైగా భారతీయ రైతులకు సేవలందిస్తున్నాయి. నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, జీతం, అప్లికేషన్ విధానం, పరీక్షా సిలబస్ వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

ఈ సంస్థ నుండి అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీస్ (Agriculture Graduate Trainees – AGT)  ఉద్యోగాలకై నోటిఫికేషన్ ను జారీ చేయనైనది. దీనికి సంబందించిన విద్యార్హతలు, వయస్సు, పరీక్ష ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలు లాంటివి ముఖ్యమైన విషయాలను కింద ఇవ్వడం జరిగింది. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు.  

విద్యార్హతలు :

IFFCO అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థి UGC నుండి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 4 సం రాల B.Sc (Agriculture) డిగ్రీ లో జనరల్ / OBC అభ్యర్థులు 60%, SC/ST అభ్యర్థులు 55% మార్కులతో పాసై ఉండాలి  చేసి ఉండాలి.  

వయస్సు :

అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 01.03.2025 నాటికి 30 సం రాలు మించకూడదు. అలాగే SC/ST/OBC అభ్యర్థులకు వయస్సు లో మినహాయింపు ఈ కింది విధంగా ఉంటుంది,
RELAXATION
SC/ST లకు 5 YEARS
OBC  లకు 3 YEARS ( non creamy layer అభ్యర్థులకు మాత్రమే)

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ బాలానగర్ లో టెక్నికల్ ఉద్యోగాలు 2025

ఎంపిక విధానం :

  1. Preliminary Computer Based Test
  2. Final Online Test
  3. Personal Interview
  4. Medical Test
ముందు గా అభ్యర్థికి Preliminary Computer Based Test నిర్వహించడం జరుగుతుంది , దీనికి పాసైన వారికి మరొక Online Test నిర్వహించి అందులో merit సాదించిన అభ్యర్థులను Personal Interview పిలవడం జరుగుతుంది ఇందులో కూడా పాసైన అభ్యర్థికి చివరగా medical test నిర్వహించడం జరుగుతుంది.  
సెలెక్ట్ అయిన అభ్యర్థికి దేశం లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టింగ్ ఇచ్చిన ప్రాంత నికి సంబందించిన ప్రాంతీయ భాష అభ్యర్థికి వచ్చి ఉండాలి.

ట్రైనింగ్ పీరియడ్ :

అన్నీ టెస్టుల్లో పాసైన అభ్యర్థులకు ఒక సం పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ప్రతి నెలకు Rs. 33,300/- stipend ఇవ్వడం జరుగుతుంది.

జీతం :

అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీ ఉద్యోగానికి సెలెక్ట్ అయి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థికి 37000-70000 పే స్కేలు తో జీతం ఇవ్వడం జరుగుతుంది, జీతం తో పాటు అన్నీ రకాల allowance కూడా లభించడం జరుగుతుంది.

సర్విస్ బాండ్ :

అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీ ఉద్యోగానికి ఎంపికై ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు సెక్యూరిటీ గా  సర్విస్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ / OBC అభ్యర్థులకు 80,000/- , SC/ST  అభ్యర్థులకు 20,000/-  ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ట్రైనింగ్ కంప్లీట్ అయిన 3 సం రాల తరువాత తిరిగి ఇవ్వడం జరుగుతుంది.

 అప్లికేషను ఫీజు :

అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అలాంటి ఫీజు లేధు.

అప్లికేషన్ విధానం:

అధికారిక వెబ్ సైటు లో ఇచ్చిన లింకు ద్వారా పూర్తి వివరలాను ఇచ్చి ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ చివరి తేదీ : 15.03.2025

ముఖ్య మైన వెబ్ సైటు : 

Official Website

Official Notification

Online Application Link

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు 2025

4 thoughts on “IIFCO లో అగ్రికల్చర్ గ్రాడ్యూయేట్ ట్రైనీస్ ఉద్యోగాలు| IFFCO Recruitment 2025 | Udyoga Varadhi”

Leave a Comment