నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCET) అనేది 73వ రాజ్యాంగ సవరణ(1992) ద్వారా, 1995లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1993 ప్రకారం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది భారత విద్యావ్యవస్థలో ప్రమాణాలు, విధానాలు మరియు ప్రక్రియలను అధికారికంగా పర్యవేక్షించడానికి ఉద్దేశించబడింది. ఈ కౌన్సిల్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన అన్ని విషయాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు పనిచేస్తుంది మరియు దాని సెక్రటేరియట్ ఉపాధ్యాయ విద్యాశాఖ మరియు జాతీయ విద్య పరిశోధన మరియు శిక్షణ మండలి(NCERT) లో ఉంది. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ యొక్క ప్రణాళికాబద్ధమైన మరియు సమన్వయ అభివృద్ధిని సాధించడం కోసం NCET ఏర్పాటు చేయబడింది. ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 ప్రకటన NTA విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో 6100 సీట్లలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP) లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ NCET 2025 కు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు కింద ఇచ్చిన సమాచారాన్ని చూడగలరు.
ఈ ఎంట్రెన్స్ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ప్రముఖ కేంద్ర/రాష్ట్ర యూనివర్సిటీలు/విద్యాసంస్థలు IITs, NITs, RIEs మరియు ప్రభుత్వ కాలేజీలలో ప్రవేశాలు పొందవచ్చును.
ప్రవేశ పరీక్ష NCET 2025, ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు మరియు ఉర్దూ భాషలలో నిర్వహించబడును.
కోర్సులు:
* B.A + B.Ed * B.Com + B.Ed * B.Sc + B.Ed
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు. ప్రశ్నాపత్రం పూర్తిగా ఇంటర్మీడియట్ స్థాయి ఉంటుంది.
సిలబస్:
తెలుగు రాష్ట్రాలలో గల పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ లో – అనంతపూర్, చిత్తూర్, గూడూర్, గుంటూరు, కాకినాడ, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం కేంద్రాలు.
తెలంగాణ లో – హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మరియు వరంగల్ కేంద్రాలు కలవు.
తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో గల సీట్లు:
ఆంధ్రప్రదేశ్ లో 1. నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి – 50 సీట్లు 2. Dr. B R అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం – 100 సీట్లు తెలంగాణ లో 1. ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ – 150 సీట్లు 2. NIT, వరంగల్ – 50 సీట్లు 3. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షట్ పేట్ – 50 సీట్లు అందుబాటులో కలవు.
అప్లికేషన్ చేయుటకు ప్రారంభ తేదీ: 20.02.2025 అప్లికేషన్ చేయుటకు చివరి తేదీ: 16.03.2025 ఎడిట్ ఆప్షన్ తేదీలు: 18, 19 March 2025 ప్రవేశ పరీక్ష తేదీ: 29.04.2025
2 thoughts on “NCET తో ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ ప్రోగ్రాంలో ప్రవేశాలు | NCET Integrated B.Ed Admissions 2025 | Udyoga Varadhi”